ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కూర్చున్న చోటే “సర్” సర్వే.

ఇంటింటి సర్వేకు ఎగనామం పెట్టిన బి ఎల్ ఏ ,బి ఎల్ వోలు,

 

వృద్ధులకు, వికలాంగులకు ఇక ఎలక్షన్ కార్డు అందదేమో

శనివారం జులై 11 . పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి “సర్ “సర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించట్లేదని పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. సర్ సర్వే నిర్వహిస్తున్న సదరు బాధ్యులు ,వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు బిఎల్ఓ లు, బి ఎల్ ఏ లు ఇంటింటికీ తిరుగుతూ …పట్టణంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులను సంప్రదించి వారి పూర్తి వివరాలు సేకరించట్లేదంటూ ..పట్టణ ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు .ఒక కాలనీ కి వెళ్ళినట్లయితే ఒకచోట కూర్చొని .ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సర్వే అధికారులు వచ్చిన విషయం కాలనీవాసులందరికీ తెలియట్లేదు. ఒక సమస్య అయితే ఇంకో సమస్య, వృద్ధులు, మూగవాళ్లు ,వికలాంగులు నడవలేని వాళ్ళు ఈ సర్ సర్వే కార్యక్రమానికి దూరమవుతున్నారు. సర్వే అంటే ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఇంట్లో ఓటు హక్కు కలిగిన ఉన్న ఓటర్ని సంప్రదించాలి .వారి పూర్తి వివరాలు సేకరించాలి .అది సర్వే అంటే ..కానీ నేడు ఒకే చోట కూర్చొని .సర్వేలు చేయడం వల్ల ఒక వ్యక్తి గురించి ఇతరులను వివరణ కోరితే.. తనకు నచ్చింది చెప్తాడు. చివరికి ఆ వ్యక్తులు ఈ ఊర్లో లేరు ఇక రారు అని కూడా తప్పుడు వివరణ ఇస్తారు .బతికి ఉన్న వాళ్ళను చచ్చినట్టుగా, చచ్చిన వాళ్లను బతికినట్టుగా కూడా తనకు తోచింది చెప్తారు. ఇలా చెప్పడం వల్ల సమగ్ర సర్వే చేసినట్లు కాదు .సమగ్ర సర్వే అంటే ప్రతి ఇంటి గడప తొక్కలి .ప్రతి ఇంటికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం తెలవాలి. సర్ సర్వే వల్ల లాభాలు ,నష్టాలు కూలంకుషంగా పట్టణ ఓటర్లకు వివరించాలి .ఇదంతా సర్ సర్వేలో మిళితమై ఉంది .కావున ఇప్పటికైనా. . ప్రభుత్వ అధికారులు ,పలు పార్టీల రాజకీయ నాయకులు ” సర్” సర్వే కార్యక్రమంపై శ్రద్ధ చూపి పట్టణానికి చెందిన బిఎల్ఎలు, బిఎల్ఓ లకు ఖచ్చితమైన, పటిష్టమైన సూచనలు చేయాలి, ఏదో సర్వే అంటే తూ..తూ.. మంత్రంగా చేసేది కాదు, పట్టణవాసుల పవిత్ర ఓటు హక్కును కాపాడే ప్రక్రియ అంటూ సూచనలు చేయాలంటూ.. పట్టణ మేధావులు, విద్యావేత్తలు ,మహిళలు, సబ్బండ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles

మందలపల్లిలో సహస్ర హీరో షోరూం ఘన ప్రారంభం – ముఖ్య అతిథిగా తాటి వెంకటేశ్వర్లు

సహస్ర హీరో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపొలిటికల్...

నాగపట్నం ప్రార్థన మందిరంలో మద్దిశెట్టి సామేలు ప్రత్యేక ప్రార్థనలు

ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించిన ఎన్‌సీపీ-ఎన్వైసీ నాయకులుపొలిటికల్ పవర్,నాగపట్నం, తమిళనాడు,సెప్టెంబర్14: తమిళనాడులోని...

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!