ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణనిజామాబాద్యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, లక్ష్య సాధనపై దృష్టి సారించాలి...

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ, లక్ష్య సాధనపై దృష్టి సారించాలి…

📰 Generate e-Paper Clip

* ఈగల్ టీం డిఎస్పి ఎం. సోమనాథం

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 16 జూలై 2026.

రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలోని విద్యార్థులకు గురువారం ఈగల్ టీం డిఎస్పి ఎం. సోమనాథం మరియు ఆర్ఎన్సిసి నిజామాబాద్ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ. పూర్ణేశ్వర్ కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ టీం డిఎస్పి విద్యార్థులతో మాట్లాడుతూ…
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరిస్తూ, నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల వల్ల వ్యక్తి, కుటుంబం మరియు సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో డ్రగ్స్ నిర్మూలనలో అధికారుల బాధ్యతే కాకుండా ప్రతి విద్యార్థి మరియు ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని గుర్తు చేస్తూ, అలాగే “డ్రగ్-ఫ్రీ-తెలంగాణ”సాధన కొరకు తమ వంతు కృషి చేస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డ్రగ్ వ్యతిరేక అవగాహన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి, బోధన్ ఏసిపి శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్ఐ మనోజ్ కుమార్, ఆర్ఎన్సిసి సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!