ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

ఢిల్లీలో నీట్ కు వ్యతిరేక ఆందోళనలు చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్ ప్రజాస్వామ్యంపై దాడి – కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి: దామాల సత్యం

📰 Generate e-Paper Clip

విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి – నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ (TSSA) డిమాండ్

ఢిల్లీలో నీట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం.

విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.

కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి.

నీట్ పరీక్షను రద్దు చేసి రాష్ట్రాల పరిధిలో నిర్వహించే విధానం తీసుకురావాలి.

విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలి.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఢిల్లీలో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అత్యంత దురదృష్టకరమని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ (TSSA) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకులు, అవకతవకలు దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీ దాడులు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని విమర్శించారు. “విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. విద్యార్థుల గొంతును అణచివేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావు” అని దామాల సత్యం పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు అవకాశం కల్పించాలని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వీరబాబు రావు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఖో -ఖో పోటీలకు రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ఎంపిక

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

వినాయక నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమo

 – పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ...

జన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

 🌹✨ జగ్గయ్యపేట రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న...

మోజర్లలో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద ఘనంగా గణపతి ఉత్సవాలు

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

విజయవాడ క్లస్టర్ 5 YSRCP విశృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం...సమావేశంలో...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!