ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిదేవుని మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి:టీఆర్పీ నాయకుల డిమాండ్..

దేవుని మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి:టీఆర్పీ నాయకుల డిమాండ్..

📰 Generate e-Paper Clip

విపనగండ్లలో టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ధర్నా…

పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చేస్తే ఊరుకోం: పటేల్ వనజ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 24 2026: విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ గారు మాట్లాడుతూ… విపనగండ్ల గ్రామంలో వందేళ్లుగా సాగుతున్న భూ దౌర్జన్యాన్ని తాము సహించేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. గ్రామంలోని సుమారు 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే సామాజిక వర్గానికి చెందిన గంగిరెడ్డి కుటుంబం అతి తక్కువ ధరకే లీజుకు తీసుకుని అనుభవిస్తోందని మండిపడ్డారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఈ భూములను సాగు చేసుకునే అవకాశం ఇవ్వకుండా, ప్రశ్నించిన వారిపై పోలీసులను మరియు అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. దేవుని ఆస్తులు గ్రామ ప్రజలందరికీ చెందాలని, తక్షణమే ఈ భూములను పేదలకు సాగు నిమిత్తం అప్పగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని పటేల్ వనజక్క స్పష్టం చేశారు.ఈ నిరసన ధర్నాలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, సుశీల, బిక్షపతి గౌడ్, జిల్లా అధ్యక్షులు విజయకుమార్ యాదవ్, మరియు కోట్ల వాసుదేవ్ మరియు స్థానిక గ్రామ ప్రజలు, మహిళలు,పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!