డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఎల్నినో నిపుణుల కమిటీ చైర్మన్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 25 2026: ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు సాంప్రదాయ పంట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. శనివారం ఉదయం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నిర్వహించిన గ్రామసభలో ఎల్నినో నిపుణుల కమిటీ చైర్మన్ ,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ… రైతులు పంట మార్పిడి విధానాన్ని అవాలంబిచడం ద్వారా నష్టాలను తగ్గించుకోవడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, సిబ్బంది సలహాలు, సూచనల మేరకు వరి పంటకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగుపై దృష్టిపెట్టాలని సూచించారు.ఇంకుడు గుంటల ద్వారా నీటిని ఒడిసిపట్టే పద్ధతుల ద్వారా వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్నారు. కరువు ప్రభావం ఉన్నందున ఉపాధి పనులను సంవత్సరం పొడవుగా ప్రజలకు పనిని కల్పించి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించామని వారు సానుకూలంగా స్పందించి వీలైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉపాధి హామీ పనులను కొనసాగించడానికి కృషి చేస్తానని అన్నారని తెలిపారు.ఎల్నినోప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందనిఆయనహామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగు, నీటి పొదుపు సరైన విధానాలు పాటించి ఎల్నినో ను ఎదుర్కోవచ్చని అన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టు అత్యంత విలువైనది కాబట్టి సంబంధిత అధికారులు ప్రజలకు నీటి అవసరం పై అవగాహన పెంచాలని సూచించారు. ఇంకుడు గుంతలు, భూగర్భ జలాల పరిరక్షణ ప్రజా ఉద్యమంగా మార్చి నీటి వనరులను పెంచాలని అన్నారు. వరికి బదులు చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు నూనె గింజల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలకు ఏ సమాచారం కావాలన్నా జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి సేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు, మండల అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు ,ప్రజలు పాల్గొన్నారు.

