పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 26 2026: వనపర్తి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మనవరాలు ధృతిక మొదటి పుట్టినరోజు వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై చిన్నారి కి శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు అనీష్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ ఎంపీపీ శంకర్ నాయక్ ,సీనియర్ నాయకులు నందిమల్ల రామ్, శ్రీను పెద్దమందడి మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
