ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరిజర్వేషన్ డే సందర్భంగా ఛత్రపతి సాహు జీ మహారాజ్‌కు ఘన నివాళులు

రిజర్వేషన్ డే సందర్భంగా ఛత్రపతి సాహు జీ మహారాజ్‌కు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27.2026.
వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర చత్రపతి సాహు  మహారాజ్ రిజర్వేషన్ డే కార్యక్రమం సందర్భంగా జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షులు మిద్దె మహేష్ మాట్లాడుతూ సాహు మహారాజ్ గారికి పూలమాలవేసి  భారతదేశంలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం 1902 జూలై 26న రిజర్వేషన్ విధానాన్నిఅమలుచేసినతొలిపాలకుడుఛత్రపతిసాహుజీమహారాజ్,వెనుకబడినవర్గాలకువిద్య,ఉద్యోగాల్లోఅవకాశాలుకల్పించేందుకు ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం భారత సామాజిక చరిత్రలో ఒక గొప్ప మైలురాయిఅని, సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాలు కూడా అభివృద్ధి చెందాలని, వారికి సమాన హక్కులు, గౌరవం, అవకాశాలు లభించాలని ఆయన దూరదృష్టితో రిజర్వేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు.అనంతరంభారతరాజ్యాంగనిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాయకత్వంలో రాజ్యాంగంద్వారారిజర్వేషన్‌కురాజ్యాంగబద్ధమైన రక్షణ లభించిందని అన్నారు.
రిజర్వేషన్ అనేది దానం కాదు, కరుణకాదు. ఇది సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగం కల్పించిన హక్కు. వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సమాజంలోసమతుల్యతనుతీసుకురావడమేదీనికిప్రధానలక్ష్యంమని,రిజర్వేషన్ డే సందర్భంగా ఛత్రపతి సాహు జీ మహారాజ్ గారి సేవలను స్మరించుకుంటూ, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయులకు ఘన నివాళులు అర్పిద్దాం.ఈకార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ గూడెం ఏల్లస్వామి , ఈ సి మెంబెర్ బి.కార్తీక్, అసెంబ్లీ ఇంచార్జెస్  మండ్ల  మైబుస్ వాల్మీకి, మేకల ఆంజనేయులు యాదవ్,అసెంబ్లీ అధ్యక్షులు దండురాజ్, కోశాధికారి దొడ్ల శంకర్, పెబ్బేరు మండల అధ్యక్షులు ఎర్రం భరత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!