ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

రుద్రూర్ పోలీసుల వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ 5 కిలోల గంజాయి…

📰 Generate e-Paper Clip

 

– గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు

– ఇద్దరు నిందితుల అరెస్టు

– రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

– ప్రెస్ మీట్ ద్వారా వివరాలను వెల్లడించిన పోలీసులు


నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.27 జులై 2026.

 

రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రుద్రూర్ పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భాగంగా 5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 50000 రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… రుద్రూర్ పోలీసుల బృందం ఆదివారం మధ్యాహ్నం అంబం రోడ్ దగ్గర గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వేరు వేరు మోటర్ బైక్ లపై అనుమానస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారి వాహనాల పెట్రోల్ ట్యాంక్ కవర్లోని ప్లాస్టిక్ కవర్లలో దాచిన గంజాయిని గుర్తించి ఒకరి వద్ద 3 కిలోలు, మరొకరి వద్ద 2 కిలోలు మొత్తం 5 కిలోలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు బీహార్ కు చెందిన బలవంత్ కుమార్ సింగ్ (37), కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ కు చెందిన కరికేల్లి సంజీవ్ (37) గా పోలీసులు వీరిని గుర్తించారు. విచారణలో భాగంగా తేలిన విషయాలు ఏమిటంటే..  బలవంత కుమార్ సింగ్ గత కొంతకాలంగా కామాక్షి రైస్ మిల్లులో పనిచేస్తున్నట్లు, మరొకరు సుమారు మూడు సంవత్సరాల నుండి కోటగిరిలోని బాలాజీ రైస్ మిల్లులో గుమస్తాగ పనిచేస్తున్న కరికేల్లి సంజీవ్ తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరు కలిసి రైస్ మిల్లులో పని చేసే హమాలీలకు గంజాయి విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. బలవంత్ కుమార్ సింగ్  బీహార్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి తీసుకువచ్చి, సంజీవ్ తో కలిసి రైస్ మిల్ లో పనిచేసే హమాలీలకు విక్రయిస్తున్నట్లు విచారణలో భాగంగా తేలింది. ఈ విధంగా వచ్చే డబ్బును ఇద్దరూ పంచుకునే వారని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. వీరికి గంజాయి సరఫరా చేసే రాహుల్ బీహార్ రాష్ట్రానికి చెందిన వాడని, అతను ఇప్పుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అదేవిధంగా వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసి వినియోగించిన ఏడుగురి పైన కూడా కేసులను నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సహకరించిన బోధన్ ఏసిపి శ్రీనివాస్, సిసిఎస్ ఎసిపి, బీట్ ఫోర్స్, రుద్రూర్ సిఐ కృష్ణ, ఎస్సై మనోజ్ కుమార్ మరియు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.


 

Latest Articles

మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కీర్తిశేషులు ఆళ్ల నాని...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేతసెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత   సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్...

ఎర్రగొండపాలెం సర్కిల్లో అనుమతి లేని చోట వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయరాదు

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జనానికి వెలుగండ ఫీడర్ కెనాల్...

Related Articles

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు..

కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీగా  వలసలునిజామాబాద్ జిల్లా రుద్రూర్  మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.6 సెప్టెంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవి...

గురుపూజోత్సవం సందర్భంగా యోగ గురువు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ కు కేంద్రమంత్రి సన్మానం..

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్.5 సెప్టెంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ విశ్వనాథ్ మహాదేన్ యోగ గురువుకు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ...
error: Content is protected !!