ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణదేశ భద్రత బిజెపితోనే సాధ్యం, దేశానికి బిజెపి దిక్సూచి

దేశ భద్రత బిజెపితోనే సాధ్యం, దేశానికి బిజెపి దిక్సూచి

📰 Generate e-Paper Clip

మరో 20 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పాలన

నీట్ పరీక్ష పత్రం లీకేజీ కాంగ్రెస్ రాజకీయ కుట్ర 

తెలంగాణలో పేపర్ల లీకేజీ, పైపులైను లీకేజీ 

పట్టించుకోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి 

దేశాన్ని సుదీర్ఘంగా పాలించింది ఎవరు?

దేశంలో కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చెల్లవు

దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్ కుట్ర 

రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు -మున్నూరు రవీందర్

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 29 2026: భారతదేశాన్ని 1947 నుంచి వరుసగా 1996 వరకు సుదీర్ఘంగా దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన విషయం గుర్తుపెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నకర చేతుల్లో ఉగ్రవాదుల చేతుల్లో ప్రపంచ దేశాల చేతుల్లో తాకట్టు పెట్టడానికి కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ దేశ ప్రజలు అధికారంలోకి రాకుండా 1996 నుంచి 2026 నేటి వరకు వరుసగా భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రులుగా దేశ ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించిన విషయం గుర్తుపెట్టుకోవాలని రాష్ట్ర బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది వనపర్తి జిల్లా కు చెందిన మున్నూరు రవీందర్ కాంగ్రెస్ వాదులకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఆయన నివాసంలో ప్రజా ప్రతిభ జర్నలిస్టుతో ఆయన కొద్దిసేపు ముచ్చటిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. 1947 నుంచి ఈ దేశంలో ఆనాడు ప్రధానమంత్రిగా స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 1964 వరకు పని చేశారని ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి 1964 నుంచి 1966 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారని అదే విధంగా ఇందిరాగాంధీ 1966 నుంచి 1977, 1980, 1984 వరకు పని చేశారని ఆ తర్వాత ప్రధానమంత్రిగా మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ప్రధాని స్వర్గీ పివి నరసింహారావు 1991 నుంచి 1996 వరకు పనిచేయగా 1996 నుంచి 1998 వరకు బిజెపి పార్టీ నుంచి మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బీహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా పనిచేస్తూ 2004 వరకు ఈ దేశానికి ఆయన చేసిన సేవలు నేటికీ మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పనిచేసిన విషయం ఆ పార్టీ రాష్ట్రస్థాయి జాతీయస్థాయి నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. 2014 నుంచి 2026 వరకు ఈ దేశంలో బిజెపి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం లో శాంతి భద్రతలు కాపాడుతూ ఈ దేశాన్ని దేశ ప్రజలను సురక్షితంగా సుభిక్షంగా కంటినిండా నిద్రపోయే విధంగా బిజెపి పాలన కొనసాగుతుందని అన్నారు. అలాంటి బిజెపి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి రాబోయే 20 సంవత్సరాలు ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమని ఆయన భీమ వ్యక్తం చేశారు.ఈ విధంగా ఈ దేశాన్ని అనేకసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించి దేశాన్ని బ్రష్టు పట్టించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ పేరుతో దేశంలో అధికారం దాహం కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు దేశంలోని యువత తిప్పి కొట్టిన సంగతి గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజం టెర్రరిజం, అణచివేస్తూ దేశ ప్రజల భద్రత కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు 24 గంటలు సుఖంగా నిద్రపోతున్న సంగతి ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద కొడుకు అయినా అమెరికా దేశంతో చైనా దేశంతో ఒప్పందాలు పెట్టుకొని ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికి కుట్ర చేస్తుందని మున్నూరు రవీందర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ దేశంలో కాక్రోస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంతమంది సపోర్ట్ మద్దతు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులను చేపట్టిందని. కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమం కోసం బిజెపి పార్టీ కట్టుబడి పని చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంశపరంపరమైన రాజకీయాలు ఈ దేశంలో చేస్తుందని అందుకు నిదర్శనం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత మాత్మ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఈ విధమైన వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని భారతీయ జనతా పార్టీలో వంశపరమైన రాజకీయాలు వారసత్వం రాజకీయాలు ఎక్కడ కూడా చేయలేదని గుర్తు చేశా. అధికార దాహం కోసం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టలు కుతంత్రాలు చేస్తూ యువతను రెచ్చగొడుతుందని అయినా కూడా ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలకు సోషల్ మీడియాలో కోట్లాదిమంది ప్రజలు యువకులు నరేంద్ర మోడీకి మద్దతుగా నిలిచిన విషయం గుర్తు చేశారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ పైన బిజెపి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి కూడా గుర్తు చేశారు. దేశంలో ఎక్కడ కూడా పరీక్ష పత్రం లీకేజీ జరుగుతే 10 కోట్ల రూపాయలు జరిమానా తో పాటు పది సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ప్రత్యేక చట్టం తెస్తుందని సంగతి కూడా గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప సహసోపేతమైన నిర్ణయం బిజెపి ప్రభుత్వం తీసుకున్న సంగతి దేశంలోని యువత మేధావులు విద్యావంతులు గుర్తిస్తున్న సంగతి ఆయన గుర్తు చేశారు. ప్రపంచ దేశాలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ఈ దేశాన్ని అమ్ముకోవడానికి కుట్ర చేస్తుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రపంచ దేశాలలో చైనా దేశం అన్ని దేశాలపై ఆధిపత్యం చేస్తున్న కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా ,అమెరికా దేశాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టిన సంగతి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భారతదేశం చైనా దేశానికి అమ్ముకోవడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. అంతేకాక భారతదేశంలోని యువత ఇతర దేశాలలో ఉపాధి కోసం ఉద్యోగాల కోసం వెళ్లకుండా మనదేశంలోనే అన్ని వసతులు కల్పిస్తూ ఈ దేశంలోని యువతకు బిజెపి ప్రభుత్వం ఉద్యోగపరమైన ఉపాధిపరమైన అవకాశాలు కల్పిస్తుందని మున్నూరు రవీందర్ సూచించారు. అన్ని అవకాశాలు బిజెపి ప్రభుత్వంలోని యువతకు ఈ దేశంలో లభిస్తాయని అందులో ఎలాంటి అనుమానం లేదని అన్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీలో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందని దోషులకు కఠిన శిక్షలు విధించడం జరుగుతుందని ప్రశ్నాపత్రం లీకేజీ పైన పార్లమెంటులో బిజెపి చర్చకు సవాల్ విసిరిన కూడా కాంగ్రెస్ పార్టీ భయపడి పోయిందని ఆ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మోడీ ప్రభుత్వం అడుగుజాడలో పయనించాలని ఆయన సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!