– పాలన చేతగాని దద్దమ్మలు గత బిఆర్ఎస్ పాలకులు, విహారయాత్రలు చేస్తూ ఫొటోలకు పోజులు ఇస్తూ కాలువల వెంబడి తిరుగుతున్నారు,
– రైతులకి సకాలంలో సాగునీరు అందిస్తున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులే కారణం
– దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30.2026.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టిందే బిఆర్ఎస్ పార్టీఅని,పాలన చేతగాని దద్దమ్మలు గత బిఆర్ఎస్ పాలకులు, విహారయాత్రలు చేస్తూ ఫొటోలకు పోజులు ఇస్తూ కాలువల వెంబడి తిరుగుతున్నారు, రైతులకి సకాలంలో సాగునీరు అందిస్తున్నామంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులే కారణం మని దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.
బుధవారం దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మండలంలోని భీమా ఫేజ్-1. స్టేజ్ -2 పంప్ హౌస్ నుండి శంకర్ సముద్రం కు సంకిరెడ్డిపల్లి, రాయిణి పేట్, నాచారం పేట, విలియం కొండ, ఈదుల బావి తండా తదితర గ్రామాలకు దిగువకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి తో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నీటిని విడుదల చేశారు.ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
మాట్లాడుతూ దేవునిదయతోగతవారంరోజులుగా ఎగువన కురిసిన వర్షాల వల్ల నిన్న రాత్రి నుంచి జూరాలకు దాదాపు 30 వేల క్యూసెక్కుల వరద వస్తుంది.నిన్ననే జూరాల లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది దిగువకు 27, వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుందని,ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురువలేదు,నీటి విడుదల గతఏడాది కంటే కొద్దిగా ఆలస్యం అయిన మాట వాస్తవం గతంలో ఈపాటికి దిగివకు సాగునీరుని విడుదల చేశాం. ఈసారి కొద్దిగా ఆలస్యం అయ్యింది. గత వారం రోజులుగా ఎగువన కురిసిన వర్షాల ఆధారంగా జూరాలకు వరద వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని ,నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ రైతులకు జూరాల ద్వారా నీటిని విడుదల చేయాలని ఆదేశించారని అన్నారు.రెండురోజుల క్రితం కోయిల్ సాగర్ ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేశామని,రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న నీటి వరులని జాగ్రత్తగా వినియోగిస్తున్నాం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వల్ల సాగునీరు చాలా జాగ్రత్తగావడిసిపట్టుకుంటున్నామని అన్నారు.ఇది రైతు ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డగా రైతుల సంక్షేమ ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని,మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు ఏమి పాలు పోక విహారయాత్రల పేరుతో డ్యాములు ,జలాశయాలు ,కాలువలు ,గట్ల వెంబడి తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ మేమె చేశాం ఆనేతీరులో బిల్డప్ ఇస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రజా పాలన పాలనలో ఏమి జరిగనట్టు మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారి తప్పుడు ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని,గత పదిహేళ్లుగా అధికారంలో ఉన్న ఈ ఫోటోల ఫోజులు వీరులు అప్పట్లో మంత్రులుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వెలగబెట్టింది ఏంటిఅనిఅడుగుతున్నారని, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత 2014 నుండి 2023 డిసెంబర్ వరకు వాళ్లే అధికారంలో ఉన్నారు. పాలమూరు జిల్లాలో వారుఅధికారంలోఉన్న10సంవత్సరాలలో ఒక్క ఎకరం కూడా అదనంగా సాగులోకి తీసుకురాలేదని,ఈరోజు కాలువల ద్వారా డ్యామ్‌ల ద్వారా రైతులకు సాగునీరు అందుతుంది అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టుల పుణ్యమే.జూరాల ,నెట్టెంపాడు,భీమా ,ఫేజ్ వన్ ,ఫేజ్ టు ,కోయిల సాగర్ ,శంకర సముద్రం అన్ని ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాటి రోజుల్లో నిర్మించినవే. మీరు పది సంవత్సరాల్లో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్టు ఉంటే ఏంటో చెప్పాలి.మీ హయాంలో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయింది నిర్మాణం మధ్యలో ఆగిపోయిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి పనులను నిర్మించాలని అడగలేదని అన్నారు.ఈ విహారయాత్రలు ఏవో అప్పుడే చేయాల్సింది అప్పుడు చేయలేదు పైగా మా కేసీఆర్ నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి అనే విషయం మాకు చెప్పేవాడు అంటున్నారు .ఈ ప్రాజెక్టులకు మీకు ఎలాంటి సంబంధం లేదు మీరు నిర్మించిన ప్రాజెక్టులు కాదు ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్మించిన ప్రాజెక్టులు పాయింట్ల తడుపుకుని ఒకరిపై ఒకరు పూలు చల్లుకొని ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఈ ప్రాజెక్టు మేము నిర్మించాం మేము కట్టాం అన్ని సొల్లు కబుర్లు చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కుంటు పడడానికి ప్రధాన కారణం బిఆర్ఎస్ పాలకులే కారణం,కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి కమిషన్లకు కక్కుర్తి పడి ఆగ మేఘాల మీద కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. మూడేళ్లకి కూల్చేశారని అన్నారు.ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏనాడు సమీక్షలు పెట్టలేదని, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకురాలేదు ప్రెస్ మీట్ లు పెట్టలేదు,
విహారయాత్రలు చేయలేదని అన్నారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను బిఆర్ఎస్ గాలికి వదిలేస్తే గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులపై సమీక్షసమావేశాలునిర్వహించారు. ఇది మా చిత్త శుద్ధి.2014 కంటే ముందు నిర్మించిన ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్ బిఆర్ఎస్ వాళ్లు అక్కడికి వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదు రైతులను మొత్తం మీరే ఉద్ధరిస్తున్నట్లు కలరింగులు బిల్డప్పులు తప్ప ఇంకోటి లేదని,ఆర్ డి ఎస్ పై మాకు పూర్తి
చిత్తశుద్ధి ఉంది,ఆర్డీఎస్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అవగాహనతో సమీక్షలు జరిపి పెండింగ్ పనులు అన్ని త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని జూరాల నీటి లభ్యతతో నిర్మించి ఉంటే ఈపాటికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఈ ప్రాంత రైతులకుసాగునీరుఅందేది.ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యేదని,కమిషన్లు కక్కుర్తి పడి నార్లాపూర్ దగ్గరికి తీసుకెళ్లి పూర్తి చేయకుండా పెండింగ్‌లో పెట్టి పాలమూరు పడావు పెట్టింది బిఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా దోచుకొని దోపిడీ చేసింది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ నాయకులకుఒకవిషయంస్పష్టంచేయదలుచుకున్నాను గత 10 ఏళ్లుగా మీరు పూర్తి చేయలేని అసంపూర్తిగా వదిలేసిన పనులను చిత్తశుద్ధితో మేము పూర్తి చేస్తున్నాము.అది చూసి ఓర్వలేక కడుపు మంటతో ఇటు రైతులను అటు ప్రజలను మభ్యపెడుతూ అసత్యాలను నిరాధారమైనఆరోపణలనుమాపైచేస్తున్నారు.నీళ్లుఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఇప్పుడు వదలాలి వంటిఅంశాలపైమాకుపూర్తిఅవగాహనఉం ది.నిరంతరం ప్రజల్లో ఉంటున్నాము మీలా ఫామ్ హౌస్‌లలో కాదు,నిరంతరం ప్రజల మధ్య ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు అన్ని శాఖల మా అధికారులు వాళ్లు అప్రమత్తంగా ఉంటూ మమ్మల్ని అప్రమత్తం చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకునేలా సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నామని అన్నారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతుల నష్టపోకూడదని వారికి అవగాహన సదస్సులు నిర్వహించి రైతులను ఆరుతడి పంటలు వేసేలా ప్రోత్సహిస్తున్నాం,రైతులు కూడా కూడా గమనిస్తున్నారు వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయో ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ వర్షం కురవడం లేదు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఎప్పటికప్పుడు మేము రైతులను అప్రమత్తం చేస్తూ వారికి కావలసిన సలహాలు సూచనలు ఇస్తూ తగిన సహకారంఅందిస్తున్నాం.ప్రతి నీటి బొట్టుని జాగ్రత్తగా వడిసిపట్టి చెరువులు కుంటలు నింపుకొనిచాలాజాగ్రత్తగానీటిని వాడుకుంటున్నాం. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారిని అన్ని విధాల ఆదుకుంటాం మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోమదనాపూరం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పల్లెపాగు ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి యాదవ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పాపయ్య గారి పల్లవి కృష్ణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, మాజీ జెడ్పిటిసి పి జె. బాబు,కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సలీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శలు పి. కృష్ణారెడ్డి , ఎన్ జె. బో హెజ్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్, రామ్ రెడ్డి, అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి, సర్పంచుల సంఘం అధ్యక్షులు మాసన్న,మాజీ కో ఆప్షన్ సభ్యులు జే యం.మిషేక్, మూలమల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబ్, కొత్తకోట మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ అలీ, మాజీ వార్డు సభ్యులు నరేంద్ర సాగర్, దేవరకద్ర అసెంబ్లీ అధ్యక్షులు ముస్తఫా, పి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మోహన్ రెడ్డి, రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ బి. శివరాములు, అమడ బాకుల మాజీ సర్పంచ్ జి శ్యాంసుందర్ గౌడ్, ఫిషర్ మ్యాన్ సందా వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్, సర్పంచ్ రామ్ లాల్ నాయక్,బూత్కూర్,సర్పంచ్,బాంగరయ్య,గోకరయ్య,సాయిల్ యాదవ్,మహమ్మద్ ఖలీల్, ఎండి. ఫెరోస్, లతీఫ్, సుల్తాన్, భాస్కర్, రాములు యాదవ్, ముంత లక్ష్మయ్య యాదవ్, నా గబుచ్చన్న నాయుడు, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

