ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచీకరుచెట్టు తండా గ్రామపంచాయతీలో SIR ప్రక్రియ 100% పూర్తి – బీఎల్‌ఓ చిట్టెమ్మకు ఘన సన్మానం

చీకరుచెట్టు తండా గ్రామపంచాయతీలో SIR ప్రక్రియ 100% పూర్తి – బీఎల్‌ఓ చిట్టెమ్మకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 30 2026: పెద్దమందడి మండలం చీకరుచెట్టు తండా గ్రామపంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్–83 పరిధిలో ఓటర్ల వివరాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియ 100 శాతం విజయవంతంగా పూర్తైంది. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు గౌరవ తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీఎల్‌ఓ చిట్టెమ్మను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బీఎల్‌ఓల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో బూత్ నంబర్–83లో 100 శాతం ఆన్‌లైన్ డిజిటలైజేషన్ పూర్తి కావడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పామిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మధిర శ్రీశైలం, చీకరుచెట్టు తండా మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, వార్డ్ సభ్యుడు పాత్లావత్ ఖంధర్, మాజీ వార్డ్ సభ్యుడు శంకర్, పాత్లావత్ కిషన్, ముందరి తండా కిషన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!