– ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31.2026.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఆత్మకూర్ తహసీల్దార్,కార్యాలయంలోఆత్మకూర్,అమరచింత మండలాల ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ తో కలిసి సంబంధితఅధికారులతోసమీక్షనిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో ఉన్న గుడిసెల్లో నివసించే వారిని పూర్తిస్థాయిలో ధృవీకరించి,అర్హులైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ లాగిన్లో తమ వద్దకు పంపాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై కూడా ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, వారిని వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా చైతన్యం కల్పించాలని ఆదేశించారు. ఆర్థిక కారణాలతో వారు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉంటే వారికి స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణాలను ఇప్పించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకవేళమంజూరైన గృహాన్ని నిర్మించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోతే, సంబంధిత నిబంధనలప్రకారం వారి మంజూరును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఆ గృహాన్ని మరో అర్హులైన నిరుపేద కుటుంబానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
– విద్యార్థులు పదో తరగతిలో 100.శాతం ఉత్తీర్ణత సాధించాలి,
ఆత్మకూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను (జెడ్పీహెచ్ఎస్ బాయ్స్) సందర్శించిన కలెక్టర్, అక్కడ నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు. నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి అందజేయాలని పాఠశాల అధికారులను ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకొని నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.అదే పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మమేకమై, పాఠశాలలో అందుతున్న భోజనం,వసతులు,బోధనతదితరఅంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతి పరీక్షల్లో 100. శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలనిప్రోత్సహించారు.అనంతరంఆత్మకూర్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, భవన నిర్మాణ నమూనా(మ్యాప్)ను పరిశీలించి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. నిర్మాణ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనేప్రారంభించి,వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం కలెక్టర్ ఆత్మకూరు పట్టణంలో ఐదో వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న బైని.జానకమ్మఅనేలబ్ధిదారురాలుఇంటినికలెక్టర్,సందర్శించారు. ఇంటి నిర్మాణం పనుల గురించి లబ్ధిదారులతో ఆరా తీసిన కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ ఆత్మకూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు నమూనాగృహాన్నిసందర్శించిపరిశీలించారు.పనులుత్వరితగతినపూర్తిచేయాలనిసూచించారు. ఈ కార్యక్రమాల్లో హౌసింగ్ పీడి విటోబా, సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్ జెక్.మోహన్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

