పోలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై 30 2026: మహిళా సంఘంలో అవినీతి జరిగిందని గత మూడు నెలల కిందట డిఆర్డిఏ పిడికి జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ సెర్ప్ కు ఎర్రజమ్మని ఆంజనేయులు 5వవార్డు సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి జిల్లా ఉన్నతాధికారులు బలీదు పల్లి గ్రామానికి విచ్చేసి విచారణ చేపట్టడం జరిగింది. బలిదుపల్లి గ్రామ మహిళా సంఘం మహిళలతో అధికారులు విచారణ గ్రామసంగంలో అక్రమాలు జరిగాయని 252,000 అవినీతి జరిగిందని తేల్చారు. బలీదు పల్లి గ్రామ బుకిపేర్ శ్రీధర్ తన ఖాతా నుండి గ్రామ సంఘానికి కట్టడం జరిగిందని మహిళా మణులకు తేల్చి చెప్పడం జరిగింది. గ్రామంలో మహిళా సంఘం మీటింగ్‌లు జరపకుండా తనిష్టానుసారంగా అధ్యక్షురాలతో కార్యదర్శులతో సంతకాలు చేయించుకున్నారని మహిళామణులు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. జిల్లా ఉన్నతాధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని జిల్లా డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు.
