పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 31. 2026.
కొత్తకోట పట్టణ సమీపంలో వెంకటగిరి క్షేత్రం నందు వెలిసిన శ్రీశ్రీ భూ,లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి శ్రావణ నక్షత్ర శతమాస (100) కళ్యాణం గురువారం వైభోగంగా నిర్వహించారు. పూజలు అనంతరం అమ్మవారికి మంత్రోచ్చరణల మధ్య మేళ తాళాలతో దంపతులతో స్వామివారి కళ్యాణం ను విష్ణు నారాయణ స్వామి, కన్నయ్య స్వామి, సింగార చార్యులు స్వామి వారు కళ్యాణం ను అంగరంగ వైభవంగా నిర్వహించారు.కొత్తకోట పట్టణ ప్రాంతానికి చెందిన భక్తులు గురువారం వెంకటగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికళ్యాణంలోపాల్గొనిదర్శించుకునిమొక్కలుతీర్చుకున్నారు.శోభయమానంగా అలంకరించి కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో జిలకర బెల్లం తదితర పూజలు అనంతరం అమ్మవారికి మంగళ సూత్రధారణ జరిపించారు.స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి విగ్రహాలను ఆలయం అర్చకులు పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి కళ్యాణ మండపంలో అర్చకుల వేద మంత్రాలతోకళ్యాణంవైభవంగానిర్వహించారు.ఆలయ గర్భగుడి నుండి ఉత్సవ మూర్తి విగ్రహాలని కింద ఉన్న కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి కళ్యాణం నిర్వహించిన తర్వాత పల్లకిలో కూర్చోబెట్టి స్వామి వారి భక్తులు పల్లకి సేవతో గోవింద నామస్మరణల మధ్య భుజాలపై పల్లకిని మోసుతు ఆలయం చుట్టూ భక్తులు ప్రత్యక్షణాలు చేస్తూ పల్లకి సేవలు వైభవంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి భక్తులుఅధికసంఖ్యలోపాల్గొన్నారు.అనంతరం వచ్చినభక్తులకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.ఈ కళ్యాణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావుల రవీంద్రనాథ్ రెడ్డి, వేముల శ్రీనివాస్ రెడ్డి, బలిజపల్లి శ్రీనివాసులు, జి నరోత్తం రెడ్డి,ధన్వాడ వెంకటేష్,నాగరాల శ్రీనివాస్ రెడ్డి, యాదయ్య సాగర్, మోహన్ యాదవ్, గంగు బాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు ముదిరాజ్, మేడిశెట్టి జ్యోతి,ప్రసన్నలక్ష్మి,బీమారజిని,రాణి,అనిత,విజయలక్ష్మి, రాజేశ్వరి,వసంత, తదితరులు పాల్గొన్నారు.

