పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 30 2026: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామపంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా బూత్ నంబర్ 71లో ఓటర్ల ప్రక్రియ ఆన్‌లైన్ డిజిటలైజేషన్ విజయవంతంగా పూర్తైంది. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ వెంకటస్వామి మరియు మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సింగిల్ విండో డైరెక్టర్ గౌని వెంకటేశ్వర రెడ్డి, మాజీ సర్పంచ్ బి. రమేష్ యాదవ్, నాయకులు ఎస్. బాలు, సి. యాదగిరి, బుచన్న, ఈశ్వర్ పాల్గొన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి మధు గౌడ్, బీఎల్‌ఓ గోపాల్‌రావు ఆధ్వర్యంలో ఓటర్ల వివరాల ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అధికారులు బీఎల్‌ఓలు, సిబ్బందిని అభినందిస్తూ ప్రజల సహకారంతో SIR కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఓటరు జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
