పిర్జాది గూడ : పొలిటికల్ పవర్ న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ
ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల భాగంగా దేశగోని శ్రీనివాస్ గౌడ్ కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పీర్జాదిగూడ 9వ డివిజన్ లోని పర్వతాపూర్ లో (గౌడ సంఘం భవనం దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడిపల్లి సిఐ.జలంధర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి జాతినీ ఉద్దేశించి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది మనం దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించం కానీ దేశాన్ని బాగు చేయాలిసిన అవసరం నేటి యువత చేతుల్లోనే ఉన్నది.కానీ యువత మాదకద్రవ్యలకు బానిసలుగా మరి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని యువత దేశభక్తితో క్రమశిక్షణతో దేశం కోసం ఎన్నో అద్భుతాలను సాధించాలని కోరడమైనది అలాగే దేశగోణి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల వలన మనకు స్వాతంత్రం వచ్చింది అని గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా స్వతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి విముక్తి మాత్రమే కాదు పేదరికం నుండి విముక్తి అవినీతి నుండి విముక్తి కూడా స్వాతంత్రమే మన గ్రామాల్లో పిల్లలను బడికి పంపడం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వంటి విషయాలను ప్రజల్లో అవగాహన తెచ్చే విదంగా చూడాలని కోరారు. ఈ కార్యాక్రమంలో గౌడ సంఘం సెక్రటరీ దుబ్బాక జైహింద్ గౌడ్,బత్తులు సాయిలు గౌడ్ (గౌడ సంఘం ఉప అధ్యక్షులు) దుబ్బాక నర్సింహా దాస్ గౌడ్(డైరెక్టర్)మునికుంట్ల అంజనేయులు గౌడ్ (డైరెక్టర్) మరియు గౌడ సంఘం పెద్దలు & యువకులు తదితరులు పాల్గొన్నారు.
