పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ హైదరాబాద్, ఆగస్టు 21 2026: మంత్రి కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 18 మంది ప్రజాప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. ప్రెస్‌మీట్‌లో నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, బీర్ల ఐలయ్య, మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. కొండా సురేఖపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి వర్గానికి చెందిన నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు 20 మందిలోపే హాజరు కావడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం కాంగ్రెస్‌లోని అంతర్గత రాజకీయ సమీకరణాలపై చర్చకు దారితీసింది.
