ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజా పోరాటాల సూరీడు సురవరం సుధాకర్ రెడ్డి  ప్రథమ వర్ధంతి

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా ప్రజా పోరాటాల సూరీడు సురవరం సుధాకర్ రెడ్డి  ప్రథమ వర్ధంతి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్  తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026.ప్రజా పోరాటాల సూర్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్ అన్నారు. శనివారం సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమవర్ధంతినినిర్వహించారు.చిత్రపటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థినేతగా జీవితం ప్రారంభించి ఏఐవైఎఫ్ నేతగా ఎదిగి కార్మిక కర్షకబడుగుబలహీనవర్గాలపక్షానఅనేకఉద్యమాలకు నాయకత్వం వహించి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, అనంతరం జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎదిగారు అన్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేశారని జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందన్నారు. దేశంలో సిపిఐ బలోపేతానికి గ్రామాలకు సైతం వెళ్లిన చరిత్రఆయనదన్నారు.కమ్యూనిస్టుగాఆదర్శభావాలతో నిరాడంబర జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ విదేశాల్లో మేధావిగా, గంభీరమైనవక్తగా ప్రశంసలు పొందారన్నారు.
వలస జిల్లా బతుకులను వెలుగులోకి తెచ్చిన సురవరం
ఉమ్మడి పాలమూరు వలస బతుకులపై ఆయనపలు వేదికల్లో గళమెత్తరన్నారు. కరువు జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం అవసరం నొక్కి చెప్పటమే గాక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారన్నారు. పాలమూరు జిల్లా ఆకలి చావులను రాష్ట్ర కేంద్ర పాలకుల దృష్టికి ఇచ్చేందుకు జిల్లా నుంచిహైదరాబాద్,కుపాదయాత్రలునడిపారని, ఆకలి చావులను నివారించేందుకు పార్టీపక్షానఅన్నం, అంబలి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు.
వనపర్తి జిల్లాతో ప్రత్యేక అనుబంధం
వనపర్తి జిల్లాతో సురవరం సుధాకర్ రెడ్డి కి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వనపర్తి జిల్లా ఆఫీసును ఆయనజాతీయకమిటీసభ్యుడిగాఉండగాప్రారంభించారన్నారు. అనారోగ్యంలోను హైదరాబాద్ వెళ్తే వనపర్తి లో పార్టీ పరిస్థితిపై ఆరా తీసేవారన్నారు. అనారోగ్యంలోనూ వనపర్తి జిల్లా కమిటీ అవసరాల కోసం రూ. 20000 సొంత డబ్బు అందజేసిన గొప్ప మనసు ఆయనదన్నారు. ఉన్నత కులంలో పుట్టి, పార్టీ కోసం పేదల అభ్యున్నతి కోసం జీవితాన్ని ధారబోసిన ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కంకణ బద్ధులు కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, సురేష్,ఎన్ఎఫ్ఐ డబ్ల్యు సభ్యురాలు వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!