కందాళ ధర్నాతో కదిలిన ప్రభుత్వం..
*పాలేరు రైతుల పోరాటానికి విజయం..*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ పాలేరు నియోజకవర్గం రిపోర్టర్ యన్ రమేష్ బాబు
పాలేరు నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యపై పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం పాలేరు చెరువు వద్ద ధర్నా నిర్వహించి, పాత కాల్వకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందాళ ఉపేందర్ రెడ్డి ధర్నా చేసిన రెండు రోజుల్లోనే పాలేరు పాత కాల్వకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు రావడం.. ఆయన చేసిన పోరాటానికి లభించిన విజయంగా భావిస్తున్నాం. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాగునీటి కోసం గట్టిగా పోరాడిన కందాళ ఉపేందర్ రెడ్డి ఉద్యమం ఫలించింది. ఇది కందాళ పోరాట విజయంతో పాటు పాలేరు రైతుల విజయంగా చెప్పుకోవచ్చు. పాత కాల్వకు నీరు విడుదల కావడంతో వేలాది ఎకరాల పంటలకు ప్రయోజనం చేకూరనుంది. నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.రైతుల కోసం కందాళ పోరాటం కొనసాగుతుంది. పాలేరు రైతుల హక్కుల కోసం ఎప్పటికీ ముందుండి పోరాడుతాం.

