– సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలి, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టేసందేశాలపైఅప్రమత్తంగా ఉండాలి,
– జిల్లాలో గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను డీజీపీకి వివరించిన జిల్లా ఎస్పీ. సునీత రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోసెప్టెంబర్.08.2026.రాబోయేగణేష్.ఉత్సవాలనుప్రజలుఎలాంటిఅవాంఛనీయసంఘటనలకుతావులేకుండాప్రశాంతవాతావరణంలోభక్తిశ్రద్ధలతోనిర్వహించుకునేలాపోలీసుఅధికారులు ముందస్తుప్రణాళికతోపటిష్టమైనభద్రతచర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ. ఆనంద్ అధికారులను ఆదేశించారు.ఉత్సవాలసందర్భంగాగతంలోచోటుచేసుకున్న సంఘటనలు, సున్నిత ప్రాంతాలు, ర్యాలీలు, నిమజ్జన కార్యక్రమాలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపైప్రత్యేకదృష్టిసారించాలనిసూచించారు. సోమవారండీజీపీకార్యాలయంనుండిరాష్ట్రంలోనిపోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు,అన్నిస్థాయిలపోలీసు అధికారులతోవీడియోకాన్ఫరెన్స్,ద్వారాసమగ్రసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే గణేష్ ఉత్సవాల భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాలు తదితర అంశాలపై డీజీపీ సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తిజిల్లా ఎస్పీ. సునిత రెడ్డిఐపీఎస్,జిల్లాపోలీసుఅధికారులతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోరాబోయేగణేష్ ఉత్సవాల సందర్భంగా చేపడుతున్నముందస్తు భద్రతా చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు, సున్నిత ప్రాంతాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన కార్యక్రమాల భద్రత తదితర అంశాలను రాష్ట్ర డీజీపీ కి వివరించారు.ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలకుప్రతీకగా,ప్రశాంతవాతావరణంలోజరగాలి. ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి పోలీసు అధికారి ముందస్తు ప్రణాళికతోపనిచేయాలి. గతఅనుభవాలనుపరిగణనలోకితీసుకునిసమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు మరియు పోలీసుశాఖ మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసి, ఉత్సవాలను విజయవంతంగానిర్వహించాలనిముందస్తుప్రణాళికతో భద్రత.గణేష్ మండపాలు, ఊరేగింపులు,నిమజ్జన ప్రాంతాలు,ప్రధానకూడళ్లు,సున్నితప్రాంతాలనుముందుగానే గుర్తించి తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి ఉత్సవాల సమయంలో చిన్నపాటి ఘటనలు సైతం పెద్ద సమస్యలకు దారితీయకుండా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలి నిమజ్జనకార్యక్రమాలపై ప్రత్యేకదృష్టినిమజ్జనమార్గాలు,చెరువులు,జలాశయాల వద్ద భద్రతాఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి సోషల్ మీడియాపై నిఘావదంతులు,తప్పుడుప్రచారం,రెచ్చగొట్టేపోస్టులు, అభ్యంతరకర సందేశాలు వ్యాప్తి చెందకుండాసోషల్ మీడియానునిరంతరంపర్యవేక్షించాలి.ప్రజల్లోఅపోహలు, ఆందోళనలు కలిగించే సమాచారాన్ని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.నిర్వాహకులతో సమన్వయం గణేష్ ఉత్సవ కమిటీలు,నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను సజావుగా నిర్వహించాలి డీజీపీ సూచించారు.అనంతరం ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఆర్ అదనపు ఎస్పీ. వీరా రెడ్డి, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ. బాలాజీ నాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, ఆత్మకూరు సీఐ శివకుమార్, కొత్తకోట సీఐ ఓ.డి. రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లాలోని ఎస్సైలు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.



