ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తితెలంగాణ రాష్ట్ర పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత...

తెలంగాణ రాష్ట్ర పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పి. మధుకర్ స్వామి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గద్దె భాస్కర్ మరియు రాంకీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మువ్వ రామి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 9వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వాట్సాప్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్ లో అందుబాటులో ఉన్న QR కోడ్ లేదా లింక్ ద్వారా సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 9:00 గంటల వరకు అని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం 2026 సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 పరీక్షా కేంద్రాలలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్ వనపర్తి పరీక్ష కేంద్రాలు ఉంటాయని తెలిపారు. అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులలో ఉమ్మడి మహబూబ్నగర్ కు చెందిన 100 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుందని ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన వసతి తో కూడిన రెసిడెన్షియల్ శిక్షణ, ఉచితంగా డ్రస్సులు ఇవ్వబడునని పరీక్ష ఫలితాలు ఈనెల 22వ తేదీన వెలబడుతున్నట్లు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఈనెల 25వ తారీకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ శంషాబాద్ క్యాంపస్ నందు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. ఈ శిక్షణ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పోలీసు నియామక ప్రక్రియలోని మెయిన్ పరీక్ష వరకు నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!