వినాయక ఉత్సవ కమిటీకి పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ అభినందనలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 19 2026: శ్రీరంగాపూర్, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ కలిసి గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో శ్రీరంగాపూర్ మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. మాజీ ఎంపీపీ పృథ్వీరాజ్ మాట్లాడుతూ… ప్రతి ఏడాది ప్రజలు ఐకమత్యంతో, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా వినాయక ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. భక్తులందరూ పండుగను ఆనందోత్సాహాల మధ్య భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ధనంజయ్ రాజ్, వెంకట్రామ్ రాజ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


