ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

*దేవుని కడపలో ఘనంగా 12వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం* స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం – 66 డివిజన్లలోనూ పార్టీ జెండా ఎగరేస్తాం: జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, సీసీ సభ్యులు కే.సురేష్ బాబు ధీమా*

📰 Generate e-Paper Clip

 

**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 

*కడప నగరంలోని దేవుని కడప ప్రాంతంలో 12వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, సీసీ సభ్యులు కే. సురేష్ బాబు, మాజీ మేయర్ పాక సురేష్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, సీనియర్ నాయకులు జరుగు రాజశేఖర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమైర్ తదితరులు హాజరయ్యారు.*

*12వ డివిజన్ ఇన్‌చార్జి నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పార్టీ కార్యాలయాన్ని నాయకులు ప్రారంభించి, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయాలు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మధ్య వారధిగా నిలవాలని, స్థానిక ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.*

*వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని అన్నారు.*

*రానున్న స్థానిక ఎన్నికల్లో కడప నగరంలోని మొత్తం 66 డివిజన్లలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందనే ధీమాను నాయకులు వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసమే తమ విజయానికి పునాది అని పేర్కొన్నారు.*

*వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందించడమే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.*

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్ బంగారు నాగయ్య యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి జయచంద్ర రెడ్డి,జిల్లా కార్యదర్శి తక్కోలి రమేష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ షఫీ, కిరణ్,త్యాగరాజు,మల్లికార్జున, మాజీ కోఆప్షన్ సభ్యురాలు మరియలు, మహిళ అధ్యక్షురాలు టిపి.వెంకట సుబ్బమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు బండి దీప్తి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు కంచుపాటి బాబు,స్థానిక నాయకులు సుబ్బరాయుడు, రామసుబ్బయ్య, రమణారెడ్డి, శివ, వేణుగోపాల్, మల్లికార్జున రెడ్డి, ఓబులరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి,డివిజన్ ఇన్‌చార్జిలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

భుజాలెక్కిన సమస్యలు – అబ్బా కొడుకులకి బిగ్ షాక్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నయ్య క్షేత్రస్థాయిపోరు.. కూటమి సర్కార్‌కు సెగ తప్పదా?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. నిన్నటిదాకా...

రేవంత్ రెడ్డి ‘రివెంజ్’ పాలిటిక్స్? ఓటుకు నోటు ఫిర్యాదుదారుడిపై వేటు!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*  హైదరాబాద్తె  :లంగాణ రాజకీయం మరోసారి హీటెక్కింది. సంచలనం...

*శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే ఇది చీకటి రోజు!* *కూన రవికుమార్ వి దిగజారుడు రాజకీయాలు* 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*(శ్రీకాకుళం)ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే...
error: Content is protected !!