ePaper
Thursday, October 29, 2026
📄 ePaper

జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్
సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ, “క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ” (పరిశుభ్రత మరియు పచ్చదనం) విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయింది.

ఈ నేపథ్యంలో, నేడు కేంద్ర బృందం గ్రామ పంచాయతీని సందర్శించి, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో బృందం ముఖాముఖి చర్చించి, అమలు చేస్తున్న పరిశుభ్రత మరియు పచ్చదనం కార్యక్రమాల వివరాలను, వాటి ప్రభావాన్ని తెలుసుకుంది. అదేవిధంగా, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది.

ఈ కేంద్ర బృందంలో శ్రీ పినాకి తహబిల్దార్, కార్యదర్శి, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ (MoPR) మరియు శ్రీ సత్యజిత్ పాత్రో, కన్సల్టెంట్, SoEPR పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి *శ్రీమతి బి. అనూష* , కొత్తగూడెం డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ కె. ప్రభాకర్, ఎంపీడీఓ శ్రీమతి బి. భారతి, ఎంపీఓ శ్రీ జె.ఎల్.జి. గాంధీ, గ్రామ సర్పంచ్ శ్రీ గూగులోత్ జానకిరామ్ మరియు పంచాయితీ కార్యదర్శి శ్రీ అజ్మీర నరసింహారావు మరియు ఇతర పంచాయతీ కార్యదర్శులు మరియు గ్రామా స్తులు పాల్గొన్నారు.

Latest Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

జూలూరుపాడు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై మండల సిపిఐ సమితి ఆగ్రహం 

 జూలూరుపాడు అక్టోబర్ 29: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

మార్కెట్ కమిటీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి:సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్

కొత్తగూడెం, అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

భద్రతా చర్యలు పాటించకుండా నివాస ప్రాంతంలో భారీ మొత్తంలో టపాసుల అక్రమ నిల్వ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

మేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,మేడిపల్లి పోలీస్...

Related Articles

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి, అక్టోబర్- 29:వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం...
error: Content is protected !!