మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
హైదరాబాద్ : ఎటు చూసిన కాషాయం అయినభాగ్యనగరం వీధులు. SIRపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోతోంది.
SIR, EVM ల వ్యవస్థ మీద పార్లమెంటులో ప్రత్యేక సమావేశానికి బీజేపీ సిద్ధంగా ఉందని. దమ్ముంటే హాజరు కావాలని రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరిన అమిత్ షా. హైదరాబాద్‌ను నిజాం పాలన నుండి విముక్తి చేసి, భారత దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన కృషి మరువలేనిది అని, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఆచూకీ లేని ఓటర్ల పేర్లను తొలగించడం ప్రజాస్వామ్యంలో భాగమే. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే ధ్యేయంగా గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయత్రకు వేలాది సంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చి కదం తొక్కారు. అడుగుడుగునా జై బీజేపీ నినాదాలతో మార్మోగిన యాత్ర మార్గం..ఎటు చూసినా కాషాయ జెండాలతో రెప రెపలాడింది.
SIRపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్, ఇండీ కూటమి రాజకీయాలకు గట్టి సమాధానమిచ్చేలా నిజాం కాలేజ్ సమీపంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ X రోడ్స్ వరకు పాదయాత్ర సాగింది.
అనంతరం భారీ సభను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ అమిత్ షా గారు… హైదరాబాద్‌ను నిజాం పాలన నుండి విముక్తి చేసి, భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన చారిత్రాత్మక కృషిని గుర్తుచేసుకున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు నిర్మూలించి అర్హులైన భారత పౌరుల ఓట్లు కాపాడేందుకు ఉద్దేశించిన SIR ప్రక్రియను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ… ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం, మరణించిన వారు, డూప్లికేట్ ఓట్లు, ఆచూకీ లేని ఓటర్ల పేర్లను తొలగించడం వల్లనే ఓటర్ల జాబితాలో మార్పులు జరిగాయని చెప్పారు. అలాంటి పేర్లు ఓటర్ల జాబితాలో ఎందుకు ఉండాలని ఆయన నిలదీశారు.
బీజేపీ ఎన్నికల విజయాలకు ‘SIR’ కారణమన్న రాహుల్ గాంధీ వాదనను అమిత్ షా గారు తిప్పికొట్టారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు గెలిచినప్పుడు ఎలాంటి SIR ప్రక్రియ జరగలేదని గుర్తుచేశారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ విజయాలు ప్రజల మద్దతు వల్లే సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
SIR, EVMలు, అక్రమ చొరబాట్లు, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు లేవనెత్తిన ఇతర అంశాలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి బీజేపీ సిద్ధంగా ఉందని.. దమ్ముంటే హాజరు కావాలని రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడం మానేసి, అర్ధవంతమైన చర్చల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గెలిచినప్పుడు EVMలను అంగీకరించిన రాహుల్ గాంధీ, బీజేపీ గెలిచినప్పుడు మాత్రం ఈ ప్రక్రియను ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు.
దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోతోందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఒడిశాలో దశాబ్దాలుగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓటములకు SIR కారణం కాదని, ప్రజలు తిరస్కరించడమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చేశారని, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు తెలంగాణను ఎలా వాడుకుంటున్నారో ఎండగట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’ కనీసం ఒక్కటి కూడా సరిగా అమలు కాని విషయాన్ని గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ… ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు, ఉగ్రవాదం మరియు నక్సలిజంపై ఉక్కుపాదం మోపిన వైనాన్ని గుర్తుచేశారు. భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

