
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రికమాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :
గార్ల మండల CHC ఆస్పత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సరిపడా మందులను సరఫరా చేయాలని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి లు డిమాండ్ చేశారు.CHC హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని CPM ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట రోగులతో కలిసి ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పటల్లో యధావిధిగా అన్ని రక్త పరీక్షలు చేయాలని,ఆస్పత్రిలో జనరేటర్ సౌకర్యం,పోస్టుమార్టం గదిలో శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ ను ఏర్పాటు చేసి,ఆస్పత్రిలో తక్షణమే డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించాలని డిమాండ్ లతో కూడిన పత్రాన్ని వైద్యాధికారులకు అందజేశారు. హాస్పిటల్ సమస్యలపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు స్పందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో CPM మండల నాయకులు ఎ. వీరాస్వామి, వి.వెంకటేశ్వర్లు,ఐద్వా మండల అధ్యక్ష,కార్యదర్శులు చింతా మౌనిక,మల్లెల నాగమణి, కె.ఈశ్వర్ లింగం,ఎస్.కె మౌలానా, కె.రామకృష్ణ,వార్డు సభ్యులు ఎల్. పూర్ణచందర్రావు,CPM , ఐద్వా నాయకులు జి వీరభద్రం, వి.ఇస్తారి,బి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

