పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 04 2026: వనపర్తిలో దివంగత శ్రీ రామన్ గౌడ్ సంతాప సభ ఘనంగా నిర్వహించబడింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సభకు సభాధ్యక్షులుగా నారాయణ, రిటైర్డ్ టీచర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చీర్ల జనార్ధన్, జన విజ్ఞాన వేదిక నరేందర్, రామ్ రెడ్డి, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చీర్ల నాగేంద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ… రామన్ గౌడ్ సమాజం కోసం చేసిన కృషి, ఆయన నిజాయితీ, మంచితనం ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. అనంతరం రామన్ గౌడ్ కుమారులు శ్రీధర్ గౌడ్ మరియు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ… తమ తండ్రి పేరు మీద 9వ వార్డులోని బాలురు మరియు బాలికలలో టాప్ స్టూడెంట్స్ గా నిలిచిన 4 గురికి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున మొత్తం రూ. 20,000/- అందజేస్తామని ప్రకటించారు. అలాగే వేసవిలో అంబలి కేంద్రం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభలో బండారు శ్రీనివాస్, నరేందర్ గౌడ్, చెన్నయ్య గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, రవి, వెంకటస్వామి, గట్టయ్య, ఈశ్వరయ్య గౌడ్, కుటుంబ సభ్యులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. చివరిగా అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

