ePaper
Friday, November 6, 2026
📄 ePaper

భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి:ఏఐయూకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము

📰 Generate e-Paper Clip

పంట నష్టంపై తక్షణ సర్వే చేపట్టి పరిహారం అందించాలి

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున, దమ్మపేట, నవంబర్ 4: దమ్మపేట మండలంలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్‌) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము డిమాండ్ చేశారు.

భారీ వర్షాల ప్రభావంతో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులు వర్షాల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతు వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. పంట నష్టంపై తక్షణమే అధికారిక ప్రకటన చేసి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంటల నష్టంతో పాటు గ్రామాల్లో వర్షాలకు పూరిళ్లు దెబ్బతిని నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని రాము పేర్కొన్నారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే వర్షాల కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

దమ్మపేట మోడల్ కాలనీ నీట మునిగిన నేపథ్యంలో అక్కడ తక్షణమే సహాయక చర్యలు చేపట్టి, వరద నీటిని తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించాలని అమర్లపూడి రాము కోరారు.

Latest Articles

ప్రత్యామ్నాయాలను పట్టించుకోని ప్రభుత్వం… ఏకపక్ష ధోరణితో ఏజెన్సీలో విధ్వంసం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

*దుగ్గిరాల ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..*  *7 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలి వైఎస్ఆర్సీపీ డిమాండ్*..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

వనపర్తిలో న్యాయవ్యవస్థకు సరికొత్త వసతులు..

తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్...

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను...

పేద విద్యార్థుల విదేశీ విద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ

మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధికి వనపర్తి నుంచి 8...

Related Articles

మురసు తుపాను దెబ్బకు అతలాకుతలం.. నష్టాన్ని పరిశీలించిన మంత్రి

దెబ్బతిన్న చెరువులు, నీటమునిగిన పంట పొలాల పరిశీలన.. ప్రాణనష్టం జరగకుండా అధికారుల సమష్టి కృషిపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి రిపోర్టర్ ఎం నాగార్జున,నవంబర్ 5: మురసు తుపాను ప్రభావంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

 వరదలతో దెబ్బతిన్న ఇళ్లు పంట పొలాలు రహదారులు చెరువుల పరిశీలన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున:మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట...

error: Content is protected !!