ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

మురసు తుఫాన్ ఉగ్రరూపం.. నేలమట్టమైన పంటలు.. బోరుమంటున్న అన్నదాతలు!  * చేతికొచ్చిన పంట వర్షార్పణం.. జూలూరుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్  * అనంతారంలో ఈదురుగాలులకు కూలిన చెట్లు.. స్తంభించిన రాకపోకలు

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు/అనంతారం (పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక):

మురసు తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో తుఫాన్ ధాటికి చేతికందిన పంటలన్నీ నేలమట్టమై తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరి, పత్తి, మిరప తదితర పంటలు నీట మునిగి ఊడ్చుకుపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా అనంతారం గ్రామ ప్రజలు బోరున విలపిస్తూ.. “తీవ్ర శ్రమకోర్చి సాగు చేసిన పంటలు కళ్ల ముందే నాశనమయ్యాయని, తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని” వాపోయారు. ఎటు చూసినా విరుచుకుపడిన గాలిదుమారానికి పెద్ద ఎత్తున చెట్లు కూలిపడి ప్రధాన రహదారులపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

తక్షణమే న్యాయం చేయాలి..

ఈ తీవ్ర సంక్షోభ పరిస్థితులపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పూర్తి దర్యాప్తు నిర్వహించాలని, దెబ్బతిన్న పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి తమకు తగిన న్యాయం చేయాలని స్థానిక ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. మురసు తుఫాన్ కాటేసిన నేపథ్యంలో జూలూరుపాడు మండలాన్ని వెంటనే ‘కరువు మండలం’గా ప్రకటించి, బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

 

Latest Articles

మహబూబాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..! 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

*బేతుపల్లి చెరువు ఘటనపై మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణ* * కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా..  *ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు*

  *ఖమ్మం పొలిటికల్ పవర్ ప్రతినిధి :*సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార...

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...

నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్‌సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త...
error: Content is protected !!