రూ.2 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు..
రహదారి, తాగునీరు, హరిత హోటల్‌తో పాటు పర్యాటకులకు ఆధునిక వసతులు
అభివృద్ధి పనులతో ఆధ్యాత్మికతకు పర్యాటక శోభ
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: వనపర్తి ప్రాంతానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే తిరుమలయ్య గుట్టను సకల సౌకర్యాలతో కూడిన సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసిందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వెల్లడించారు. పర్యాటక అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శనివారం ఉదయం మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తిరుమలయ్య గుట్టను సందర్శించారు. ఈ సందర్భంగా మెట్ల మార్గం గుండా కాలినడకన కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ పరిసరాలను, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తిరుమలయ్య గుట్టను ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా పర్యాటకులను ఆకర్షించే ఆహ్లాదకరమైన ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంజూరైన రూ.2 కోట్లతో కొండకు మెరుగైన రహదారి సదుపాయం, తాగునీటి వసతి, హరిత హోటల్ నిర్మాణం, పర్యాటకులు విశ్రాంతి తీసుకునేందుకు అనువైన ఆవాసాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. ఈ వసతుల కల్పనతో భక్తులు, పర్యాటకులు కుటుంబ సమేతంగా సౌకర్యవంతంగా సందర్శించేలా తిరుమలయ్య గుట్టను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి నెల 7వ తేదీన వనపర్తి ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతి వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారని పేర్కొంటూ.. మన ప్రాంతంలోనే కొలువై ఉన్న తిరుమలయ్య గుట్ట శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 7వ తేదీన స్థానిక భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ క్షేత్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని తిరుమలయ్య గుట్టకు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. ప్రజల సహకారం, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ ప్రాంతాన్ని వనపర్తి జిల్లాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, మండలాధ్యక్షులు రవి యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య,జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, సర్పంచుల sc సెల్ రాష్ట్ర అధ్యక్షులు రాములు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, SLN రమేష్, కౌన్సిలర్లు గొల్ల రవి, క్రాంతి గౌడ్, పీతాంబరం, సర్పంచులు శివ, వాల్యా నాయక్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు యాదవ్, రఘు యాదవ్, చుక్క రాజు, పాల రవి, దేవన నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


