ePaper
Monday, November 9, 2026
📄 ePaper

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

📰 Generate e-Paper Clip

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: వనపర్తి రూ.14 కోట్లతో డబుల్ రోడ్డు.. తిరుమలయ్య గుట్టకు రూ.2 కోట్లు.. గ్రామాభివృద్ధికి మరో రూ.2 కోట్లు | 82 ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పిస్తాం పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెద్దగూడెం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. శనివారం పెద్దగూడెం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో నిర్వహించిన ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డితో కలిసి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 35 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను అందజేశారు. మిగిలిన అర్హులైన లబ్ధిదారులకు కూడా త్వరలో పట్టాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దగూడెం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… పెద్దగూడెం గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గతంలో కరవు పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయే ప్రమాదం ఎదురైనప్పుడు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపి సాగునీరు తీసుకువచ్చి రైతుల పంటలకు తడులు అందించామని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. పెద్దగూడెం గ్రామానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేయించామని, రూ.14 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. తిరుమలయ్య గుట్టను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు, పెద్దగూడెం గ్రామ అభివృద్ధికి మరో రూ.2 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా వీ.ఓ.ఏ. భవనాన్ని కూడా మంజూరు చేయించామని వివరించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు గ్రామంలో పేద కుటుంబాలకు ఇళ్ల కల సాకారం చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇప్పటికే 35 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించామని, తెలిపారు. అదనంగా మరో 25 ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మొత్తంగా 82 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గ్రామంలో ఒక్క గుడిసె కూడా లేకుండా ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. గ్రామంలో ఇప్పటికే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించామని, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతుల సౌకర్యార్థం సింగిల్ విండో కార్యాలయాన్ని పెద్దగూడెంలోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొనే నేపథ్యంలో గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడేలా పొలాలకు వెళ్లే దారుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. చందాపూర్ ఖాన్ చెరువు కెనాల్ నుంచి పెద్దగూడెం చెరువుకు నీటిని అనుసంధానం చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ కాలనీకి సంబంధించి 12 ఎకరాల లేఅవుట్‌లో మిగిలిన అర్హులైన వారికి కూడా ఇంటి స్థలాలు కేటాయించి పట్టాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం పెద్దగూడెంలో బ్యాంకు ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. దీపావళి పర్వదినం సందర్భంగా లబ్ధిదారులకు పట్టాలు అందించడం సంతోషంగా ఉందని, పట్టాలు పొందిన వారు ఇక ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గతంలో మంజూరై మిగిలిపోయిన 10 ఇందిరమ్మ ఇళ్లతో పాటు కొత్తగా మరో 15 ఇళ్లు మంజూరు చేయాలని శివసేన రెడ్డి ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రెవెన్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేష్ రెడ్డి, పెద్దగూడెం సర్పంచ్ పుష్పలత శివకుమార్, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ సర్పంచ్ జానకి కొండన్న, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

సిఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు: పాలేరులో హోరెత్తిన సంబరాలు!

పాలేరు నియోజకవర్గం / దానవాయిగూడెం (59వ డివిజన్):తెలంగాణ రాష్ట్ర డైనమిక్ ముఖ్యమంత్రి,...

శంభునిగూడెంలో మిరుమిట్లు గొలిపిన దీపావళి సంబరాలు! చదువుల వెలుగులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు..

 - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి ప్రతినిధి (కాకటి సత్యప్రసాద్):భద్రాద్రి కొత్తగూడెం...

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో...

అవ‌మానిస్తే 2 సార్లు రాజ్య‌స‌భ‌, 19 ప‌ద‌వులు వ‌స్తాయా..? – సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు

పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణమాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి ప‌చ్చి అబ‌ద్ధాలు,...

Related Articles

కొత్తకోట మున్సిపల్ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు పెట్టి వ్యాపారస్తుల దగ్గర అక్రమంగా వసూళ్లు

– జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆఫీసు అంటు జిటి.నారాయణ స్కూల్  లోపల  ఒక్కొకరిని లోపలికి పిలిచి లక్షల రూపాయలు వసూళ్ళు, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...

అద్వాని జీవితం భాజపా కార్యకర్తలకు ఆదర్శ వంగ ఉండాలి

 – ఉమ్మడి  మహబూబ్ నగర్, జిల్లా బీజేపీ      ఉపాధ్యక్షులు కొమ్ము భరత్ భూషణ్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక...
error: Content is protected !!