ePaper
Friday, November 13, 2026
📄 ePaper

సమాఖ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే జారె వినతి

📰 Generate e-Paper Clip

CBO HR పాలసీ అమలు చేయాలని PR & RD కమిషనర్‌కు విజ్ఞప్తి

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్ ఎం. నాగార్జున: తెలంగాణ రాష్ట్రంలోని మండల, జిల్లా సమాఖ్యల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చొరవ తీసుకున్నారు. ఈ మేరకు మండల, జిల్లా సమాఖ్యలకు చెందిన అకౌంటెంట్లు, ఆపరేటర్లు, అటెండర్లు తదితర ఉద్యోగులతో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సమాఖ్యల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సంక్షేమం, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి CBO HR పాలసీని అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

ఉద్యోగులకు న్యాయం జరిగేలా వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.

Latest Articles

Related Articles

పర్వతనేని వరప్రసాద్ జన్మదినం సందర్భంగా..శ్రీ ధర్మశాస్త్ర పూజ పీఠంలో నారాయణ సేవ

పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్12: మండల కాంగ్రెస్ నాయకులు పర్వతనేని వరప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర పూజ పీఠంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు.పీఠం గురుస్వామి తోట శ్రీనివాసరావు...

ఆపదలో ఆపన్నహస్తం.. ప్రాణరక్షణ సేవలకు ప్రశంసాపత్రం!

దమ్మపేట ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల అరుదైన గుర్తింపుపొలిటికల్ పవర్,దమ్మపేట: ఆపద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలను కాపాడిన దమ్మపేటకు చెందిన ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి....

ముత్యాలమ్మ ఆలయానికి విరాళం.. ఆదివాసీ గ్రామాల రహదారిపై గళమెత్తిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్, దమ్మపేట, నవంబర్ 11:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ...
error: Content is protected !!