ePaper
Friday, November 13, 2026
📄 ePaper

పెండింగ్ అరెస్టులు పూర్తి చేయాలి,  NDPS కేసుల్లో సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించాలి, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలి. నేర నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.  జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్, జిల్లాలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నమోదైన వివిధ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణ చర్యలు, ముందస్తు నేర నివారణ (Proactive Policing), సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.

నల్లబెల్లం అక్రమ రవాణా – పెండింగ్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి:

జిల్లాలో నల్లబెల్లం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలకు సంబంధించి నమోదైన కేసులను సమీక్షిస్తూ, ఆయా కేసుల్లో పెండింగ్‌లో ఉన్న నిందితుల అరెస్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులను గుర్తించి, సరఫరా వ్యవస్థను ఛేదించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా తయారీ, విక్రయ కేంద్రాలపై నిరంతరం నిఘా ఉంచి, ప్రత్యేక దాడులు నిర్వహించాలని, గుడుంబా తయారీకి వినియోగించే ముడిసరుకు, నిల్వలు, సరఫరా మార్గాలను గుర్తించి కేసులు నమోదు చేయాలని సూచించారు.

NDPS కేసులు – మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం:

జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. NDPS చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును పటిష్టంగా చేపట్టి, నిందితుల అరెస్టులతో పాటు మాదకద్రవ్యాల సరఫరా మూలాలు, ప్రధాన సరఫరాదారులు, కొనుగోలుదారులు, రవాణా మార్గాలను గుర్తించి మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించాలన్నారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, పునరావృత నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

Proactive Policing – నేరాలు జరగకముందే నివారణ చర్యలు:

నేరాలు జరిగిన తర్వాత స్పందించడమే కాకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, నేరాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలు, అనుమానితుల కదలికలపై నిఘా, రౌడీషీటర్లు మరియు పాత నేరస్తులపై పర్యవేక్షణ పెంచాలన్నారు. బీట్ పోలీసింగ్‌ను పటిష్టం చేస్తూ స్థానిక ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని, ప్రజల నుంచి అందే సమాచారాన్ని ముందస్తు నేర నివారణకు వినియోగించుకోవాలని ఆదేశించారు.

పెండింగ్ కేసుల పరిష్కారం – దర్యాప్తులో వేగం:

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన తీవ్రమైన నేరాలు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, ఆస్తి సంబంధిత నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలు మరియు చిన్నారులపై నేరాలు, రోడ్డు ప్రమాద కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. కేసుల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

CCTNS – నూతన క్రిమినల్ చట్టాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం:

నూతన క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాల సేకరణలో నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. CCTNSలో కేసుల వివరాలు, నిందితుల సమాచారం, దర్యాప్తు పురోగతి, పెండింగ్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి అప్‌డేట్ చేయాలని సూచించారు. ఈ-సాక్ష్య (e-Sakshya) ద్వారా సాక్ష్యాల సేకరణను నిబంధనల ప్రకారం చేపట్టి, డిజిటల్ ఆధారాల నాణ్యత, విశ్వసనీయతను పెంచాలన్నారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, డేటాబేస్‌లను సమర్థవంతంగా వినియోగించుకొని కేసుల దర్యాప్తు, నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు.

సీసీ కెమెరాల ఏర్పాటు – నిరంతర పర్యవేక్షణ:

జిల్లాలోని అన్ని ముఖ్యమైన కూడళ్లు, ప్రధాన రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న కీలక ప్రదేశాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సక్రమంగా నిర్వహించాలని, మరమ్మతులు అవసరమైన కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, కేసుల ఛేదనలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

డయల్ 112 – అత్యవసర ఫిర్యాదులపై తక్షణ స్పందన:

డయల్ 112కు వచ్చే అత్యవసర ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు సత్వర సహాయం అందించాలని ఆదేశించారు. స్పందన సమయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు.

ప్రజా ఫిర్యాదులు – బాధ్యతాయుతమైన పోలీసింగ్:

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా స్వీకరించి, ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పారదర్శకమైన, వేగవంతమైన, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీస్ సేవలు అందించాలని ఆదేశించారు.

Latest Articles

Related Articles

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...

నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సేవలే లక్ష్యం: సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ మాధవరావు  * ములకలపల్లి విద్యుత్ ఉపకేంద్రంలో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక  * బిల్లుల హెచ్చుతగ్గులు, లోవోల్టేజీ, వ్యవసాయ సర్వీసులపై...

ములకలపల్లి (అశ్వారావుపేట), నవంబర్ 12 (పొలిటికల్ పవర్ - ఆర్సీ కారం వెంకటేష్):విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వినియోగదారుల...
error: Content is protected !!