ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

ఎన్నికల అవగాహన పోటీల్లో అశ్వారావుపేట విద్యార్థుల విజయభేరి!

📰 Generate e-Paper Clip

వ్యాసరచనలో జీషన్‌కు ద్వితీయ స్థానం.. క్విజ్‌లో సహస్రకు తృతీయ స్థానం

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రిన్సిపల్, అధ్యాపకుల అభినందనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ వడితే గణేష్ నవంబర్ 13 2026: విద్యతో పాటు విజ్ఞానం.. పోటీల్లో ప్రతిభతో విజయమే లక్ష్యంగా అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో బహుమతులు సాధించి కళాశాల కీర్తిని చాటారు. ఈ పోటీల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఎండీ జీషన్ (CEC ప్రథమ సంవత్సరం) వ్యాసరచనలో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ కనబరిచారు. అలాగే డి. సహస్ర (MPC ప్రథమ సంవత్సరం) క్విజ్ పోటీల్లో తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.

విజయాల వెనుక విద్యార్థుల కృషి.. కళాశాల ప్రోత్సాహం!

విద్యార్థులు సాధించిన విజయాలపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఏ. అనిత, స్టూడెంట్ కౌన్సిలర్ ఎస్.కే. సాహెదతో పాటు అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. విజేతలను అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పోటీల్లో బహుమతులు సాధించడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికలపై అవగాహనతో విద్యార్థులు ముందుకు సాగడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

Latest Articles

ఆత్మీయ ఆహ్వానం ఆదార్ పార్టీ - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల...

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

Related Articles

పేదల ఇంటికి పెన్షన్ వెలుగులు.. సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం  *ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులకు పెన్షన్ భరోసా! *అశ్వారావుపేటలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జారె...

అశ్వారావుపేటలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుకు పరిశీలన!రింగ్ రోడ్డు సెంటర్‌లో స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్...

తొలితరం ఎమ్మార్పీఎస్ రెండు జిల్లాల కమిటీల ఏకగ్రీవ ఎన్నిక!  * ఖమ్మంలో ఘనంగా తొలితరం ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల సమావేశం  * 30 ఏళ్లుగా ఉద్యమంలో త్యాగాలు చేసిన సీనియర్ నాయకుల...

ఖమ్మం, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జ్ యర్ర నాగరాజు రెడ్డి):తొలితరం ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి)...
error: Content is protected !!