ePaper
Saturday, November 14, 2026
📄 ePaper

సంక్షేమ బోర్డును కాపాడుకునేందుకు పోరాడుదాం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును కాపాడుకునేందుకు కార్మికులు పోరాడాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లేబర్ ఆఫీసర్ రవికుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవనిర్మాణ కార్మికుల సహజ, ప్రమాద మరణాలకు ఇన్సూరెన్స్ చెల్లింపులను ప్రైవేటు కంపెనీకి అప్పగించడంతో దుర్వినియోగం చేశారని కార్మిక శాఖ నేరుగా బాధితులకు ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు. డెత్ సహజ మరణాల ఇన్సూరెన్స్ ను ఇందిరమ్మ బీమా పథకం ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచన విరమించాలన్నారు‌. ఐటీసీ సెంటర్ల వారికి రక్త పరీక్షల పేరుతో కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారని, అందువల్ల వెంటనే హెల్త్ టెస్టులను రద్దు చేయాలన్నారు. ఆధార్ అప్డేట్, పేర్లు సరి చేయటం, రెన్యూవల్ అప్డేట్ చేసే అధికారం ఏ ఎల్ వో కు లేకుండా రాష్ట్ర బోర్డు దగ్గర అట్టిపెట్టుకొని కార్మికులను ఆఫీసులో చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఖాళీగా ఉన్న ఏసీఎల్, డీసీఎల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. కార్మికుల అడ్డాల వద్ద షెల్టర్లు నిర్మాణం చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికి పింఛన్లు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాల కు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శులు శ్రీరామ్, గోపాలకృష్ణ, భవన కార్మిక నిర్మాణ సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న కురుమన్న, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నేతలు హుస్సేన్, పరశురాముడు, లక్ష్మన్న, కుమ్మరి శివుడు, వడ్డే భీమన్న, శ్రీనివాసులు, ఎర్రగుంట రాముడు, లక్ష్మీనారాయణ, మేస్త్రి సురేష్, ఎర్ర కురుమన్న తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఘనంగా సాయి ఎక్సలెంట్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు నవంబర్13: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

* *నాంపల్లి మండలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* 

* *నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్* *నాంపల్లి మండలంలో కాంగ్రెస్ *పార్టీ*...

గిరిజన జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్…

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్...

Related Articles

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...
error: Content is protected !!