ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భూగర్భ వారాహి మాత ఆలయం అద్భుతం – అమ్మవారిని దర్శించిన జక్కంపూడి విజయలక్ష్మి

భూగర్భ వారాహి మాత ఆలయం అద్భుతం – అమ్మవారిని దర్శించిన జక్కంపూడి విజయలక్ష్మి

📰 Generate e-Paper Clip

పొలిటీకల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే01

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో నూతనంగా నిర్మితమైన భూగర్భ వారాహి మాత ఆలయం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ ఆలయాన్ని వైఎస్సార్‌సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, బలభద్రపురం గ్రామం ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. గ్రామంలో పలు దేవాలయాల నిర్మాణం ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడం ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా భూగర్భ వారాహి మాత ఆలయం అద్భుతంగా నిర్మించబడిందని, ఇలాంటి ఆలయం కాశీలో తప్ప మరెక్కడా చూడలేమని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని బలభద్రపురంలో నిర్మించడం స్థానిక ప్రజల అదృష్టమని, అమ్మవారి దివ్యరూపాన్ని దర్శించుకోవడం తమకు లభించిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నామని తెలిపారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు విజయ్ రెడ్డి, గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకులు సబ్బేళ్ల వీర్రాఘవరెడ్డి, తేతలి శ్రీనివాస్ రెడ్డి, గుబ్బల లాజర్ బాబు, సత్యనారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!