ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ నామినేటెడ్ పోస్టుల ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక &పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 07 మే 2026: కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో పనిచేసిన నిస్వార్థ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను ప్రకటించడం పట్ల వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు, మెంబర్స్‌గా నియమితులైన నాయకులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభించడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాభిమానాన్ని సంపాదించే దిశగా ప్రతి నాయకుడు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!