ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి

వేద పండితుల సమక్షంలో దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 09 మే 2026: బ్యూరో పెబ్బేరు మండలం తోమాలపల్లి శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని దేవతా మూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరంజన్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి సన్మానించారు అనంతరం వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ధ్వజస్తంభ, బొడ్రాయి స్థాపనలతో గ్రామ ప్రజలు ఐక్యతగా మెలిగి సుఖసంతోషాలతో, సౌభాగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఆహ్వాన కమిటీ సభ్యులు ఉన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!