ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 17 2026: వ్యాప్తంగా మాదిగ సమాజం ఎన్నో ఏళ్ల పోరాటాలతో సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలాలను ప్రతి మాదిగ విద్యార్థి, యువత సద్వినియోగం చేసుకొని విద్య, ఉద్యోగ, నైపుణ్య అభివృద్ధి రంగాలలో ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ పిలుపునిచ్చారు.
ఆదివారం రోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎం ఆర్ పి ఎస్ & అనుబంధ సంఘాల జిల్లా కమిటీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ అధ్యక్షత వహించగా,
ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త గంధం గట్టయ్య మాదిగ, నాయకులు రాజానగరం రాజేష్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్ను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మాదిగ సమాజంలో విద్య, ఉద్యోగాలపై విస్తృత అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. ఈ దిశగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అలాగే, రాబోయే జూలై 7న జరిగే ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి మాదిగ పల్లెలో ఘనంగా నిర్వహించాలని, ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. ఇంకా గ్రామ కమిటీలు, జెండా దిమ్మలు లేని ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ నుండి 40 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమంగా ఎంఆర్పిఎస్ జెండా దిమ్మల నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాలపల్లి మన్యం మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు మొలకలపల్లి పరుషరాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి మండల అధ్యక్షులు మచ్చ తిరుపతి మాదిగ, చిన్నంబావి మండల అధ్యక్షులు దేవని రమేష్ మాదిగ, పెద్దమందడి మండల కన్వీనర్ వెంకట్ రాములు మాదిగ, ఆత్మకూర్ మండల ఉపాధ్యక్షులు కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా నాయకులు వర్మ మాదిగతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
