ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బల ప్రదర్శన కోసం బీజేపీ ఆఫీసుకి వెళ్ళిన బండి సంజయ్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్

బండి సంజయ్ కొడుకు మీద POCSO కేసు రిపోర్టు ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లిన పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు

 

పార్టీ అధ్యక్షుడు లేని సమయంలో అనుచరులను అందరినీ తీసుకొని పోయి హంగామా చేసిన సంజయ్

 

మంత్రి పదవి నుండి తీసేస్తారని తెలిసే మేకపోతు గాంభీర్యం

 

ఇవ్వాళ తెలంగాణ బీజేపీ ఆఫీసుకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

 

అయితే ఆయన సడన్‌గా పార్టీ ఆఫీసుకి రావడం వెనుక ఢిల్లీ పార్టీ పెద్దల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. కొడుకు పోక్సో కేసు విషయంలో బండి సంజయ్ వ్యవహరించిన తీరు బీజేపీకి తీవ్ర నష్టం కలుగజేసిందని ఆగ్రహంగా ఉన్న పార్టీ అధిష్టానం

 

దీంతో త్వరలోనే బండి సంజయ్‌కి మంత్రి పదవి నుండి ఉద్వాసన తప్పదని సిగ్నల్. దీనిలో భాగంగానే ఇవ్వాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుని ఢిల్లీకి పిలిపించి ఆయన ద్వారా బీజేపీ హైకమాండ్ ఈ ఉందంతం మీద పూర్తి రిపోర్ట్ తీసుకుంది

 

ఉద్వాసన తప్పదు అని సమాచారం అందుకున్న బండి సంజయ్ అలెర్ట్ అయి తన అనుచరులు అందరికీ పార్టీ కార్యాలయానికి రావలసిందిగా మెసేజులు ఇచ్చారు

 

బల ప్రదర్శన చేసి చూపిద్దాం అని పార్టీ ఆఫీసులో కొంత హడావిడి చేశారు. దీని ద్వారా నన్ను మంత్రి పదవి నుండి తీసేస్తే పార్టీకి నష్టం అనే సంకేతాలు పంపడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!