—–
బలభద్రపురంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సమావేశానికి భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు
పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే26:
తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులతో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)” శిక్షణా కార్యక్రమం మంగళవారం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ముందుగా నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షత వహించగా, తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే బూత్ లెవెల్ ఆఫీసర్లకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్య పారదర్శకతను కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా బూత్ స్థాయి ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. అనర్హులు లేదా డూప్లికేట్ ఓట్లను గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో బూత్ ఏజెంట్ల పాత్ర కీలకమని, పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులు ఎస్ఐఆర్ ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, సాంకేతిక అంశాలను ఏజెంట్లకు వివరించారు. గ్రామ, మండల స్థాయి నాయకులు బూత్ ఏజెంట్లకు అందించాల్సిన సహకారంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, గుబ్బల తులసిరామ్కుమార్, తోట రామకృష్ణ, అద్దంకి ముక్తేశ్వరరావు, సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), వాసంశెట్టి పరమేశ్వరరావు, కృష్ణప్రియ, గుల్లా ఏడుకొండలు, నాగరాజ్ కుమార్ గౌడ్, బొడ్డు ముత్యాలరావు, నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నాలుగు మండలాల పార్టీ కన్వీనర్లు, బూత్ కమిటీ అధ్యక్షులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
