ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

సత్తుపల్లి సైబర్ మోసం కేసులో మరో నిందితుడి అరెస్ట్ – 28 మందిలో 27 మంది అదుపులో

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పొలిటికల్ న్యూస్ 9 తెలుగు టీవీ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ బ్యూరో : యర్ర నాగరాజు రెడ్డి, సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన భారీ సైబర్ నేర కేసులో మరో నిందితుడు నల్లనాగుల శ్వేతన్ (ఖమ్మం నివాసి) ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ శ్రీహరి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, శ్వేతన్ 2023లో చంద్రుగొండలోని కేథలిక్ సిరియన్ బ్యాంక్ (CSB)లో “శ్వేతన్ ఎంటర్‌ప్రైజెస్” పేరుతో కరెంట్ అకౌంట్ ప్రారంభించాడు.ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అడపా రామవెంకట చరణ్ ఇచ్చిన సమాచారం మేరకు, అతని సహచరులు ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ హైదరాబాద్‌లో ఒక సంస్థ ఏర్పాటు చేసి విదేశాల్లోని వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు కాల్ సెంటర్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు ఫోన్లు చేసి స్టాక్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్, గేమింగ్, బెట్టింగ్, ఓటీపీ ఫ్రాడ్‌లు, రూపే ట్రాన్సాక్షన్లు, మ్యాట్రిమోనీ వంటి పేర్లతో అధిక లాభాల ఆశ చూపించి మోసాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, వివిధ లింకులు, క్యూ ఆర్ కోడ్‌లు పంపించి వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. ఈ మోసాలకు అవసరమైన బ్యాంకు ఖాతాల కోసం పలువురి పేర్లపై “మ్యూల్ అకౌంట్లు” తెరిపించి భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. కేసులో మొత్తం 28 మంది నిందితులు ఉండగా, ఇప్పటి వరకు 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Latest Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!