.* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అనపర్తి నియోజకవర్గం రిపోర్టర్ తమిళనాడు సీఎం, టీవీకే అధ్యక్షుడు విజయ్ తనదైన శైలిలో తమిళనాట పరిపాలన సాగిస్తున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే దశాబ్దాలుగా చేయలేని సంచలన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు.*లంచం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.* ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలను అరికట్టే విధంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు నేరుగా సమాచారం అందించేలా కొత్త ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి అందరికీ షాక్ ఇచ్చారు విజయ్.ఈ క్రమంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం విజయ్. లంచం తీసుకున్న టీవీకే నేతను తక్షణమే పార్టీ నుంచి గెంటేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళ్తే.. చెంగల్ పట్టు జిల్లా తిరుపోరూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని *మాంబాక్కం పంచాయతీలో దాదాపు రూ. 9.80 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని నవీన్ అనే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. అయితే పనులు పూర్తయిన తర్వాత ఆ బిల్లులు క్లియర్ కాలేదు.*
అయితే మాంబాక్కం పంచాయితీ టీవీకే అధ్యక్షుడు వీరసామిని కాంట్రాక్టర్ నవీన్ సంప్రదించారు. *ఆయనను తన కార్యాలయానికి పిలిపించిన వీరసామి అతని నుంచి రూ. 1.30 లక్షలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. టీవీకే నేత వీరసామి ఆ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలా వీడియో సీఎం విజయ్ దృష్టికి రావడంతో అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీవీకే పార్టీ.పార్టీ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ప్రవర్తించినందుకు.. వీరసామిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం, అన్ని బాధ్యతల నుంచి తొలగించినట్లు ప్రకటించింది.* తాను సీఎం అయ్యాక లంచం తీసుకున్న వాళ్లను ఉపేక్షించనన్న మాటకు కట్టుబడి.. నాయకత్వ పటిమ చాటారని విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

