ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపబ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి మీద చర్చించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన -సిపిఎం

బ్రహ్మంగారిమఠం మండల అభివృద్ధి మీద చర్చించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన -సిపిఎం

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
ముఖ్యమైన అధికారులు 5 మంది ప్రజాప్రతినిధులు కూడా హాజరుకాని సమావేశం

అడుగడుగున అవినీతి, నిర్లక్ష్యం అలసత్వంతో అధికారులు మండల సర్వసభ్య సమావేశంలో ధ్వజమెత్తిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్

మండలంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను మండల సర్వసభ్య సమావేశంలో చర్చించి పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ సమావేశంలో డిమాండ్ చేశారు. సిపిఎం బ్రహ్మంగారిమఠం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరుగుతున్న ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నా జరుగుతున్న సందర్భంలో మండల ఎంపీపీ వీరనారాయణరెడ్డి గారు సమావేశం హాల్లోకి వచ్చి సమస్యలను తెలపవలసిందిగా సిపిఎం నాయకులును కోరారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన అధికారులు ప్రజాప్రతినిధులను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ మాట్లాడుతూ…
మండల సర్వసభ్య సమావేశానికి ఎక్సేంజ్, రెవిన్యూ తదితర అధికారులు, పట్టుమని 5.మంది ఎంపీటీసీ, లాంటి ప్రజాప్రతినిధులు రాకపోవడాన్ని ప్రశ్నించారు, ప్రజా సమస్యల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మండలంలోని అధికారులు అవినీతి నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా మండల అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని వారు ఆరోపించారు. పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో పందులు, బెల్ట్ షాపుల సమస్య తీవ్రంగా ఉందని ఇది పుణ్యక్షేత్రంగా కాక ఈ రెండింటికి అడ్డాగా తయారైందని వారు విమర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది చనిపోయారని మరికొంతమంది ప్రమాదాల బారిన పడ్డారని అయినా విద్యుత్ అధికారులలో చలనం లేదని వారు విమర్శించారు. ఎమ్మెల్యే గారే స్వయంగా 10రోజుల్లో జింకల్ నగర్ లో విద్యుత్, మంచినీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పిన చేయాలేదని వారు గుర్తు చేశారు. దేవస్థానాల ఉత్తరం వైపు ఉన్నవాగు చెత్త చెదారం, మలం మందు సిసాలతో పూడిపోయి ఉన్న పంచాయతీ అధికారులు కానీ దేవస్థానం యాజమాన్యం కానీ పట్టించుకోకుండా ఉన్నారని ఈ దుర్గందాన్ని యాత్రికులు, ప్రజలు భక్తులు తట్టుకోలేక పోతున్నారని వారు తెలిపారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు మండలంలో స్మశానాల సమస్యలు, భూముల రిసర్వే, అసైన్డ్ భూములు, సోలార్ పవర్ ప్రాజెక్టులో బలవంతపు భూసేకరణ వీటన్నిటిమీద సమావేశంలో చర్చించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మండల ఎంపీపీ వీరనారాయణరెడ్డి ఎంపీడీవో రామచంద్రారెడ్డి గార్లకు వినతి పత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్థామని వారు హామీయిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ నాయకులు ఎద్దు రాహుల్ శ్రీనివాసులు, మేరీ గురయ్య కలావతి, సుబ్బమ్మ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!