గిరిజన విద్యార్థుల సంక్షేమానికి ఐటీడీఏ ప్రత్యేక దృష్టి….!
పొలిటికల్ పవర్, ఆగస్టు 18:
దమ్మపేట:గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఐటీడీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, డీడీ, ఏటీడీఓ అధికారుల ఆదేశాల మేరకు దమ్మపేట మండలం పార్కలగండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపకం-3 పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమరం సుశీల, ప్రధానోపాధ్యాయులు రవి , ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధి, వారికి అందుతున్న సౌకర్యాలు, పాఠశాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు విద్యలో ముందుకు సాగేందుకు అవసరమైన సహకారం అందించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలపై అధికారులు ఆరా తీసి, విద్యార్థుల అవసరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఐటీడీఏ పీవో రాహుల్ కు పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
