ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

అంకాళమ్మ వారికి విశేష పూజలు

📰 Generate e-Paper Clip


నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 6 ( పొలిటికల్ పవర్ న్యూస్ న్యూస్)
లోకకల్యాణం కోసం శ్రీశైలక్షేత్ర గ్రామదేవత అయిన శ్రీ అంకాళమ్మవారికి అభిషేకం, విశేష పూజలను నిర్వహించడం జరిగింది.
ప్రతీ శుక్రవారం రోజున శ్రీఅంకాళమ్మవారికి దేవస్థానంసేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ జరిపించబడుతోంది.
ఇందులో భాగంగా శ్రీఅంకాళమ్మవారికి అభిషేకం, విశేషఅర్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించబడ్డాయి.
కాగా శ్రీశైల క్షేత్రానికి గ్రామదేవతగా చెప్పబడుతున్న అంకాళమ్మ ఆలయం, ప్రధాన ఆలయానికి ఎదురుగాగల రహదారికి చివరలో కుడివైపున ఉత్తరముఖంగా ఉంది.
ప్రకృతి శక్తుల యొక్క కళలే గ్రామ దేవతలని దేవీభాగవతంలో చెప్పబడింది.
కాగా ఈ ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని మన ఆర్షవాజ్ఞ్మయం చెబుతోంది.
చతుర్భుజాలను కలిగిన ఈ దేవి నాలుగు చేతులలో కుడివైపున క్రింది నుండి పైకి వరుసగా కత్తి, సర్పంలో చుట్టబడిన డమరుకం ఉండగా, ఎడమవైపున పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి. కిరీట మకుటం గల ఈ దేవి వస్త్రాలంకృతురాలైనా కర్ణాభరణాలను, కంఠాభరణాలను కలిగి ఉంటుంది.
కాగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజ జరిపించబడింది. ఆ తరువాత లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు.
అనంతరం పంచామృతాభిషేకం, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, జలముతో విశేషఅభిషేకం అర్చనలు నిర్వహించబడ్డాయి.

Latest Articles

టేకులపల్లి స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ 

 పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్...

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పికర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు...

Related Articles

జనసేన ఎమ్మెల్యేకు బిగ్ షాక్: బత్తుల రామకృష్ణ భార్యపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరిబాబు ఘన విజయం!

 సీతానగరం/తూర్పుగోదావరి:పొలిటికల్ పవర్ ప్రతినిధితూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సీతానగరం జెడ్పీటీసీ ఎన్నికల సమరంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణకు సీతానగరం ప్రజలు కోలుకోలేని షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భార్య...

సాంస్కృతిక కార్యక్రమాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 7 ( పొలిటికల్ పవర్ న్యూస్ )దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధనలో) శృతిలయ కూచిపూడి నృత్యాలయం, విజయవాడ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు...
error: Content is protected !!