ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంఅక్రిడేషన్ కార్డులు, బస్ పాసుల విషయంలో అన్యాయంపై జర్నలిస్టుల నిరసన

అక్రిడేషన్ కార్డులు, బస్ పాసుల విషయంలో అన్యాయంపై జర్నలిస్టుల నిరసన

📰 Generate e-Paper Clip

దశలవారీ ఆందోళనలో భాగంగా ఎమ్మెల్యే ప్రెస్ మీట్‌ను నిలబడి కవర్ చేసిన విలేకరులు

మూడో రోజు ఆందోళనలో భాగంగా నిలబడి ప్రెస్ మీట్ కవర్ చేసిన జర్నలిస్టులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 20 2026: ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్ర ఆర్సీ ఇన్‌చార్జీలకు అక్రిడేషన్ కార్డులు, బస్ పాసుల మంజూరులో జరిగిన అన్యాయానికి నిరసనగా జర్నలిస్టులు చేపట్టిన దశలవారీ ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నిర్వహించిన ప్రెస్ మీట్‌ను జర్నలిస్టులు కూర్చోకుండా నిలబడి కవర్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్ర ఆర్సీ ఇన్‌చార్జీలకు అక్రిడేషన్ కార్డులు, బస్ పాసుల మంజూరులో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!