ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసామూహిక అక్షరాభ్యాసం – గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

సామూహిక అక్షరాభ్యాసం – గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20 2026: పెద్దమందడి మండలం మణిగిల్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మరియు గురుకుల ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నస్రీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్వర్లు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో గురుకుల ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన కే. మానస, ఎం. అక్షయ, ఏ. సతీష్, ఎం. మూర్తి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శాలువాలతో సన్మానించి అభినందించారు. సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధనతో పాటు పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. చిన్నారులు విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సరస్వతి మాత ఆశీస్సులు వారికి లభించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను సద్వినియోగం చేసుకుంటూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలలో తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని నెల రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్డాకుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… విద్యార్థులు చదవడం, రాయడం, గణితంలో ప్రావీణ్యం సాధించి జీవితానికి బలమైన పునాదులు వేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, సదాచారంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యాయులు వి. రాములు, ఏసు రాములు, లావణ్య, ఆదర్శ పాఠశాల చైర్మన్ పల్లవి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఎస్. రాములు, గొంది రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కోములయ్య, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!