పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా మే 1
ఖమ్మం నగరం: అసంఘటిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం డిపో రోడ్ లో నందు ఘనంగా మే డే కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీను జండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక సంఘాల జిల్లా గౌరవ అధ్యక్షులు చిర్ర రవి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ కార్మికులు తమ హక్కుల కోసం అమెరికా చికాగో రాష్ట్రములో జరిగిన వీరోచిత పోరాట వలనే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు పని దినాలు పనికి తగ్గ వేతనం లభించిందని ఈనాడు ప్రపంచం మరియు భారతదేశంలో కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఈనాడు ఈ మేడే సందర్భంగా అసంఘటిత కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని చిర్రా రవి అన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మానిటరింగ్ రాష్ట్ర నాయకులు గుంతెటి వీరభద్రయ్య మాట్లాడుతూ ఈనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కార్మికులకు ఎనిమిది గంటలు పని వేతనం లభించిందని ఈనాడు రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతున్నాయని గుంతేటి అన్నారు ఈ కార్యక్రమంలో మోడం వెంకన్న, పమ్మి రవి, పాగి వెంకన్న, నరేందర్, ప్రభాకరా చారి, నాగరాజు, అవుట్ సోర్సింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రమేష్, సుధీర్, కత్రం పుష్ప రాజ్, మేకల రవి కుమార్ తదితరులు మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు
