ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

ఈ నెల 18న సత్తుపల్లి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్

📰 Generate e-Paper Clip

చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచన

బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో సమన్వయ సమావేశం

పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఈ నెల 18న సత్తుపల్లి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసిం సాహెబ్ తెలిపారు. ఈరోజు బుధవారం బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను (యు/సెక్షన్ 138 ఎన్‌ఐ యాక్ట్) పరస్పర రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసిం సాహెబ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.ఎస్.ఎన్. సుమబాల, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి. లావణ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. రవి, సీనియర్ న్యాయవాదులు నల్లగట్ల విజయ్ కుమార్, బి. వెంకట్రావు, వివిధ బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

మానవత్వానికి నిదర్శనం- హర్ష కేతన్ ఫౌండేషన్ ప్రారంభం

*మధిర టౌన్ ఎస్ఐ నవిత చేతుల మీదుగా ప్రారంభోత్సవం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిసమాజ...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...

error: Content is protected !!